
●స్నేహాన్ని మరిచిపోలేం
పాల్వంచరూరల్: పాల్వంచకు చెందిన సులోచనారాణి 1998లో బూర్గంపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్న రోజుల్లో అదే కళాశాలో పనిచేస్తున్న డాక్టర్ జివ్వాజి నీరజతో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి స్నేహితులుగా మారా రు. నీరజ ప్రస్తుతం హైదరాబాద్‌లోని నోయపాల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తోంది. ఎంత ఒత్తిడి ఉన్నా సమయం దొరికినప్పుడల్లా ఫోన్‌లో మాట్లాడుకుంటామని, సా మాజిక మాధ్యమాల ద్వారా క్షేమ సమాచారాలను తెలుసుకుంటా మని, స్నేహాన్ని మరిచిపోలేమని మాజీ జిల్లా ఇంటర్ నోడల్ అధి కారి సులోచనారాణి తెలిపారు.