సింగరేణి(కొత్తగూడెం): శిక్షణలో నేర్చుకున్న అంశాలను విధి నిర్వహణలో అమలు చేస్తూ సంస్థ ఆస్తులను కాపాడాలని సింగరేణి ఎస్‌అండ్‌పీసీ ట్రైనింగ్ ఆఫీసర్, సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ జాకీర్ హుస్సేన్ పేర్కొన్నారు. సోమవారం కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాలోని ట్రైనింగ్ సెంటర్‌లో 35వ బ్యాచ్ సిబ్బందికి ఫస్డ్ ఎయిడ్ అండ్ ఫైర్ ఫైటింగ్ శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. సెక్యూరిటీ సిబ్బంది విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డి.నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.