పుస్తకాలు వచ్చేస్తున్నాయి.. | - | Sakshi
Sakshi News home page

పుస్తకాలు వచ్చేస్తున్నాయి..

May 21 2024 5:10 AM | Updated on May 21 2024 5:10 AM

పుస్త

పుస్తకాలు వచ్చేస్తున్నాయి..

● జిల్లాకు చేరిన 3,15,050 పాఠ్యపుస్తకాలు ● వారంలోగా మండల కేంద్రాలకు చేరవేత ● పాఠశాలల ప్రారంభంరోజే విద్యార్థులకు పంపిణీ

కొత్తగూడెంఅర్బన్‌: విద్యా సంవత్సరంలో పాఠశాలల ప్రారంభం రోజే పాఠ్యపుస్తకాలు అందించేలా విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే పాఠ్యపుస్తకాలను జిల్లాకు చేరవేస్తోంది. ఇప్పటికే పాఠ్యపుస్తకాలు 61 శాతం చేరగా, మిగిలిన 39 శాతం పుస్తకాలు పాఠశాలల ప్రారంభం నాటికి వస్తాయని జిల్లా విద్యాధికారులు చెబుతున్నారు. నోటు పుస్తకాలు వందశాతం జిల్లాకు చేరాయి. గోదాంకు చేరిన పుస్తకాలను ఈ నెలాఖరులోగా మండల కేంద్రాలకు పంపించనున్నారు. జూన్‌ 1వ తేదీ నుంచి పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలు చేరవేయనున్నారు. జిల్లాలో అమ్మ ఆదర్శ పథకం కింద ఎంపిక చేసిన పాఠశాలల్లో ఇప్పటికే మైనర్‌ మరమ్మతులు పూర్తి చేసి కొన్ని సదుపాయాలు కల్పించారు. దీంతోపాటు మన ఊరు–మన బడి కార్యక్రమం పనులు కూడా ఇంకా కొన్ని పాఠశాలల్లో జరుగుతున్నాయి. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో ఈ ఏడాది అడ్మిషన్లు సైతం పెరిగే అవకాశాలున్నాయని విద్యాధికారులు చెబుతున్నారు. గత ఏడాది కూడా అడ్మిషన్ల సంఖ్య పెరిగింది. బడిబయట పిల్లలపై సర్వే, జూన్‌ నెలలో బాడిబాట వంటి కార్యక్రమాలతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య కూడా పెరిగే అవకాశాలున్నాయి.

నోట్‌ పుస్తకాలు వందశాతం..

జిల్లాలోని 1,299 ప్రభుత్వ పాఠశాలల్లో 63,399 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి 5,17,000 పుస్తకాలు రావాల్సి ఉండగా ఇప్పటివరకు 3,15,050 పాఠ్యపుస్తకాలు వచ్చాయి. ఇంకా 2,10,950 పాఠ్య పుస్తకాలు ఇంకా రావాల్సి ఉంది. దీంతోపాటు గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా విద్యార్థులకు నోట్‌ పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. ప్లేన్‌ నోట్‌ పుస్తకాలు 2,12,868, రూల్స్‌ నోట్‌ పుస్తకాలు 51,590.. మొత్తం 2,66,458 నోట్‌ పుస్తకాలు వందశాతం వచ్చాయని జిల్లా విద్యాధికారులు పేర్కొన్నారు. ప్రతి ఏడాది కూడా పార్టు–1, పార్టు–2గా పాఠ్యపుస్తకాలు జిల్లాకు రెండు దఫాలుగా వస్తాయి. విద్యార్థుల బ్యాగుల బరువు తగ్గించేందుకు పార్టు–1, పార్టు–2గా విభజన చేసి పుస్తకాలను పంపిణీ చేస్తున్నారు. పార్టు–2 సంబంధించి అక్టోబర్‌ నెలలో 1,43,200 పుస్తకాలు రానున్నాయి.

61 శాతం వచ్చాయి..

జిల్లాకు ప్రస్తుతం 61 శాతం పాఠ్య పుస్తకాలు, వంద శాతం నోట్‌ పుస్తకాలు వచ్చాయి. ఇంకా మిగిలిన 39 శాతం పాఠ్య పుస్తకాలు పాఠశాలల ప్రారంభం నాటికి జిల్లాకు చేరతాయి. వచ్చిన పుస్తకాలు, నోట్‌ పుస్తకాల పంపిణీ జూన్‌ మొదటి వారం కల్లా పూర్తి చేస్తాం.

–ఎం.వెంకటేశ్వరాచారి, జిల్లా విద్యాధికారి

రావాల్సిన పుస్తకాల వివరాలు

తరగతి సబ్జెక్టు

1 తెలుగు

2 ఇంగ్లిష్‌,

3 ఇంగ్లిష్‌, మ్యాథ్స్‌

4 ఇంగ్లిష్‌

6 తెలుగు, ఇంగ్లిష్‌, సైన్స్‌

7 సైన్స్‌, హిందీ

8 తెలుగు, ఇంగ్లిష్‌

9 హిందీ, బయాలజీ,

భౌతికశాస్త్రం, ఇంగ్లిష్‌, గణితం

10 హిందీ, సోషల్‌, భౌతికశాస్త్రం

పుస్తకాలు వచ్చేస్తున్నాయి..1
1/1

పుస్తకాలు వచ్చేస్తున్నాయి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement