సింగరేణి(కొత్తగూడెం): ప్రభుత్వ, ప్రవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్‌కు దరఖాస్తు గడువు పొడిగించినట్లు కొత్తగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, పాలిసెట్ కన్వీనర్ బి.నాగముని నాయక్ తెలిపారు. అపరాధ రుసుము లేకుండా దరఖాస్తు చేసుకునే గడువు సోమవారం ముగియగా, ఈనెల 28 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయని పేర్కొన్నారు. అలాగే, రూ.100 జరిమానాతో 30వ తేదీ వరకు, రూ.300 అపరాధ రుసుముతో మే 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అయితే, పరీక్ష మాత్రం యథావిధిగా మే 24న జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించాలని సూచించారు.