కాంగ్రెస్‌తోనే దేశాభివృద్ధి సాధ్యం | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌తోనే దేశాభివృద్ధి సాధ్యం

Apr 23 2024 8:35 AM | Updated on Apr 23 2024 8:35 AM

ప్రచారం నిర్వహిస్తున్న బలరాం నాయక్‌, పక్కన పొదెం, తెల్లం - Sakshi

ప్రచారం నిర్వహిస్తున్న బలరాం నాయక్‌, పక్కన పొదెం, తెల్లం

భద్రాచలంటౌన్‌: దేశంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యమని మహబూబాబాద్‌ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి పోరిక బలరాం నాయక్‌ అన్నారు. భద్రాచలంలో సోమవారం ఆయన డీసీసీ అధ్యక్షుడు పొదెం వీరయ్య, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ గాలి వీస్తోందని, తెలంగాణ ప్రజలు ఎలా మార్పు కోరుకున్నారో, దేశ ప్రజలు సైతం అదే మార్పును కోరుకుంటున్నారని తెలిపారు. ప్రతీ కార్యకర్త సైనికుడిలా పనిచేసి రాహుల్‌ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే భద్రాచలం ఏజెన్సీ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు పరిమి శ్రీనివాస్‌, టీపీసీసీ సభ్యుడు నల్లపు దుర్గాప్రసాద్‌, రవిశంకర్‌, చింతిర్యాల రవికుమార్‌ర్‌, రసూల్‌, యశోద రాంబాబు, తమ్మళ్ల వెంకటేశ్వరరావు, తరుణ్‌ మిత్రా, ఎడారి ప్రదీప్‌, సుధీర్‌, సరిత, హసీనా, వసీమ, జయ, ఆశోక్‌కుమార్‌ పాల్గొన్నారు.

మహబూబాబాద్‌ పార్లమెంట్‌ అభ్యర్థి

బలరాం నాయక్‌

1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement