మణిహారంగా ఎర్త్ సైన్సెస్..
కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైనింగ్‌ను యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌గా మార్చుతూ ఈ ఏడాది జూన్ 5న రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికి జూలై 9న డాక్టర్ మన్మోహన్‌సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా నామకరణం చేశారు. 300 ఎకరాల విస్తీర్ణంలో గల ఈ యూనివర్సిటీలో యూజీ, పీజీ కోర్సులు ఈ ఏడాది నుంచే ప్రారంభం కాగా 50 మందికి పైగా విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. జాతీయ స్థాయిలో జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చే మణిహారంగా మారిన యూనివర్సిటీని ఈనెల 2న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. అయితే నూతన భవనాలు, తరగతి గదుల నిర్మాణానికి నిధులు మంజూరు కాక విద్యార్థులు, అధ్యాపకులు ఇబ్బంది పడుతున్నారు. ఇక కొత్తగూడెంలో ప్రారంభమైన కేంద్రీయ విద్యాలయంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి సెంట్రల్ సిలబస్ బోధించనున్నారు. దీంతో విద్యార్థులకు కొంత ప్రయోజనం కలగనుంది.


