100 శాతం ఉద్యోగావకాశాలు
యువత శిక్షణ పొందాలని
కలెక్టర్ పిలుపు
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో యువతీ, యువకులకు నైపుణ్య శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో లాజిస్టిక్స్ స్కిల్ కౌన్సిల్ (ఎల్‌ఎస్‌సీ), రెడింగ్టన్ ఫౌండేషన్(సీఓఎల్‌టీఈ) సహకారంతో శిక్షణ అందిస్తున్నామని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణకు ఎంపికై న 26 మందిని సోమవారం కలెక్టరేట్ నుంచి ప్రత్యేక బస్సు ద్వారా ట్రైనింగ్ సెంటర్‌కు పంపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని పేద కుటుంబాలకు చెందిన యువత ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతూ ఎక్కువ ఉపాధి అవకాశాలను కల్పిస్తున్న రంగం లాజిస్టిక్స్ ఎక్స్‌స్‌పోర్ట్, ఇంపోర్ట్ రంగమని తెలిపారు. ఇందులో వంద శాతం ప్లేస్‌మెంట్ అవకాశం ఉన్నందున ప్రతీ ఒక్కరు శిక్షణ తీసుకోవాలని పిలుపునిచ్చారు. అత్యధిక మంది యువత ఉద్యోగాలు పొంది జిల్లాకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.


