
మహబూబాబాద్: మహబూబాబాద్ లోక్‌సభ స్థానానికి రెండో రోజు శుక్రవారం నలుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ములుగు జిల్లా మదనపల్లికి చెందిన పోరిక బలరాంనాయక్ కాంగ్రెస్ అభ్యర్థిగా రెండు సెట్ల నామినేషన్లను రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్‌కు సమర్పించారు. పినపాక నియోజకవర్గం మణుగూరుకు చెందిన పాల్వంచ దుర్గ, నర్సంపేట నియోజకవర్గం ఇటుకాలపల్లి ఏనుగుల తండాకు చెందిన బోడ అనిల్‌నాయక్ స్వతంత్ర అభ్యర్థులుగా, వరంగల్ జిల్లా నెక్కొండ మండలం ముదిగొండకు చెందిన జాటోత్ రఘునాయక్ ఆధార్ పార్టీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు.