జిల్లా కలెక్టరేట్‌లో గ్రంథాలయం ఏర్పాటు | - | Sakshi
Sakshi News home page

జిల్లా కలెక్టరేట్‌లో గ్రంథాలయం ఏర్పాటు

Nov 12 2026 1:32 AM | Updated on Nov 12 2026 1:32 AM

● ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కనీసం ఒక పుస్తకాన్ని విరాళంగా అందించాలి ● జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌

● ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కనీసం ఒక పుస్తకాన్ని విరాళంగా అందించాలి ● జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌

బాపట్ల జిల్లా కలెక్టరేట్‌లో ఉద్యోగుల విజ్ఞానాభివృద్ధి, పఠనాసక్తిని పెంపొందించే లక్ష్యంతో ప్రత్యేకంగా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ తెలిపారు. జిల్లా కలెక్టరేట్‌లోని న్యూ వీడియో కాన్ఫరెన్‌న్స్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన గ్రంథాలయం కోసం నాలుగు పుస్తక ర్యాక్‌లను ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్‌ స్వయంగా ఐదు పుస్తకాలను గ్రంథాలయానికి అందజేసి, ర్యాక్‌లలో ఉంచారు. జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు విధి నిర్వహణతో పాటు నిరంతరం విజ్ఞానాన్ని పెంపొందించుకోవడం, సమాజానికి ఉపయోగపడే విషయాలను తెలుసుకోవడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కనీసం ఒక మంచి పుస్తకాన్ని స్వచ్ఛందంగా విరాళంగా అందించాలని సూచించారు. ముఖ్యంగా భారత రాజ్యాంగం, ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌ నిబంధనలు, పరిపాలన, వ్యక్తిత్వ వికాసం, విజ్ఞానాభివృద్ధికి సంబంధించిన పుస్తకాలను గ్రంథాలయంలో అందుబాటులో ఉంచాలని తెలిపారు. గ్రంథాలయ నిర్వహణ, పుస్తకాల సంరక్షణ, వినియోగాన్ని పర్యవేక్షించేందుకు జిల్లా కలెక్టరేట్‌ నుంచి ఒక అధికారిని నియమించాలని ఇన్‌న్‌చార్జి జిల్లా రెవెన్యూ అధికారిని ఆదేశించారు. కార్యక్రమంలో ఇనన్‌చార్జి జిల్లా రెవెన్యూ అధికారి లవన్న, జిల్లా కలెక్టరేట్‌ కోఆర్డినేషన్‌ సెక్షన్‌ పర్యవేక్షకులు షఫీ తదితరులు పాల్గొన్నారు.

పీఎం ఫసల్‌ బీమా యోజనలో నమోదు

ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన (పీఎం–ఎఫ్‌బీవై)లో భాగంగా జిల్లాలోని రైతులు నిర్దేశించిన గడువులోగా నమోదు చేసుకుని పంట బీమా రక్షణ పొందాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ తెలిపారు. జిల్లా కలెక్టరేట్‌లోని న్యూ వీసీ హాలులో మురసు తుపాను ప్రభావంతో పంటల నష్టంపై వివరాలు సేకరణకు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్‌న్స్‌ నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ సీజనల్‌ షెడ్యూల్‌ ప్రకారం వరి మినహా ఇతర నోటిఫైడ్‌ పంటలు సాగు చేసే రైతులు 2026 డిసెంబర్‌ 15వ తేదీలోగా నమోదు చేసుకోవాలని, వరి పంటకు 2026 డిసెంబర్‌ 31వ తేదీ చివరి గడువుగా నిర్ణయించుకోవాలని సూచించారు. రైతులు తాము సాగు చేస్తున్న పంట, విస్తీర్ణం నోటిఫైడ్‌ జాబితాలో ఉన్నాయో లేదో నిర్ధారించుకుని, సంబంధిత గడువుకు ముందే దరఖాస్తు చేసుకోవాలన్నారు. సమావేశంలో ఇన్‌చార్జి డీఆర్వో లవన్న, జిల్లా వ్యవసాయ అధికారి ఎ.లక్ష్మి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement