నత్తనడకన కొల్లూరు మండల ఓట్ల లెక్కింపు | - | Sakshi
Sakshi News home page

నత్తనడకన కొల్లూరు మండల ఓట్ల లెక్కింపు

Nov 8 2026 4:35 AM | Updated on Nov 8 2026 4:35 AM

ఫలితాల కోసం అభ్యర్థుల నిరీక్షణ అందుబాటులో లేని తాగునీరు

కొల్లూరు: పరిషత్తు ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ నత్తనడకన సాగడంతో కొల్లూరు మండల స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల కోసం అభ్యర్థులు గంటల కొద్దీ కౌంటింగ్‌ కేంద్రం వద్ద నిలువుగాళ్ల పైన పడిగాపులు కాయాల్చి వచ్చింది. పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌ ప్రక్రియ 11 గంటల వరకు కొనసాగడంతో, బ్యాలెట్‌ బాక్స్‌ల లెక్కింపు ప్రక్రియకు జాప్యం ఏర్పడింది. పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు ముగిసిన అనంతరం టేబుల్స్‌ వారీగా, బ్యాలెట్‌ బాక్స్‌లను తెరచి బ్యాలెట్‌ పేపర్లను ఎంపీటీసీ, జెడ్పీటీసీల వారీగా విడగొట్టే ప్రక్రియ చేపట్టారు.

మండలంలోని 16 ఎంపీటీసీ సెగ్మెంట్ల బ్యాలెట్‌ పేపర్లను, జెడ్పీటీసీ బ్యాలెట్‌ పేపర్లను వేరు చేసిన అనంతరం మధ్యహ్నం 3 గంటల ప్రాంతంలో అధికారులు ఓట్ల లెక్కింపు ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఓట్ల లెక్కింపులో ఆలస్యానికి తోడు కౌంటింగ్‌ కేంద్రంలో ఉక్కపోత, మంచినీటి సౌకర్యం అందుబాటులో లేకపోవడంతో కౌంటింగ్‌ సిబ్బంది, అధికారులు, రాజకీయ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు, ఏజెంట్‌లు తీవ్ర ఇబ్బందులు

ఎదుర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement