పోలింగ్‌ బూత్‌ అధికారి నిర్వాకం | - | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ బూత్‌ అధికారి నిర్వాకం

Nov 8 2026 4:35 AM | Updated on Nov 8 2026 4:35 AM

చిలుమూరు ఎంపీటీసీ సెగ్మెంట్‌లో 426 చెల్లని ఓట్లు బ్యాలెట్‌ పేపర్లు వెనుక సంతకం, ముద్ర లేకపోవడంతో చెల్లినివిగా పరిగణన వైఎస్సార్‌ సీపీ – జనసేన అభ్యర్థుల నడుమ ఓట్ల అంతరం 176 చెల్లని ఓట్లతో గెలుపు, ఓటములపై ప్రభావం

కొల్లూరు : ఎన్నికల నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం అభ్యర్థుల గెలుపు, ఓటములపై తీవ్ర ప్రభావం చూపిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరు మండలం చిలుమూరు ఎంపీటీసీ స్థానం ఎస్సీ మహిళలకు రిజర్వ్‌ అయ్యింది. ఈ స్థానం నుంచి వైఎస్సార్‌ సీపీ నుంచి పాముల భూలక్ష్మి, జనసేన నుంచి కొండేటి సిరి ఎంపీటీసీ అభ్యర్థినిలుగా పోటీచేశారు. అయితే శనివారం నిర్వహించిన ఓట్ల లెక్కింపులో 426 ఓట్లు చెల్లినివిగా ఉండటంతో అభ్యర్థులను దిమ్మరపోయేలా చేసింది. 426 ఓట్లు చెల్లవని లెక్కింపు అధికారులు ప్రకటించడంతో కారణం తెలుసుకున్న ఎంపీటీసీ అభ్యర్థినిలు, ఏజెంట్‌లు అవాక్కయ్యారు. సంబంధిత ఎంపీటీసీ సెగ్మెంట్‌లోని ఓ పోలింగ్‌బూత్‌ అధికారి నిర్వాకం కారణంగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్న బ్యాలెట్‌ పత్రాలు చెల్లకుండా పోయినట్లు తెలుసుకుని ఆందోళనకు గురయ్యారు. పీఓ బాధ్యతలు నిర్వహించిన అధికారి బ్యాలెట్‌ పత్రాలు వెనుక సంతకాలు చేయకపోవడంతో చెల్లని ఓట్లుగా కౌంటింగ్‌ అధికారులు పరిగణించి పక్కన పెట్టారు. అయితే ఈ విషయమై చిలుమూరు ఎంపీటీసీ అభ్యర్థులుగా పోటీ చేసిన వారు ఆర్‌ఓ పద్మ దృష్టికి తీసుకువెళ్లినా పలితం లేకుండా పోయింది. ఓట్లు వేచిన బ్యాలెట్‌ పేపర్లు చెల్లకుండా పోవడంతో అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం పడుతుందని ఆర్‌ఓకు మొరపెట్టుకున్నా ఆమె నుంచి చిరునవ్వే సమాధానం అవడంతో అభ్యర్థులకు ఏమీ పాలుపోని పరిస్థితి ఏర్పడింది. ఓట్ల లెక్కింపు అనంతరం వైఎస్సార్‌ సీపీ అభ్యర్థినిపై జనసేన అభ్యర్థిని 176 ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్లు ఆర్‌ఓ ప్రకటించారు. దీనితో పోలింగ్‌బూత్‌ అధికారి నిర్లక్ష్యం కారణంగా తన గెలుపుపై ప్రభావం పడిందని వైఎస్సార్‌ సీపీ అభ్యర్థిని ఆవేదన వ్యక్తం చేస్తుండగా, తమకు దక్కాల్చిన మెజార్టీ తగ్గిందని జనసేన ఏజెంట్లు వాదిస్తున్నారు. పీఓ నిర్లక్ష్యం కారణంగా ఓట్లు చెల్లకుండా పోవడంపై తగిన చర్యలు తీసుకోవాలని కోరతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement