బాపట్ల: ఎన్నికల ప్రక్రియలో కౌంటింగ్ ఏజెంట్ల పాత్ర ఎంతో కీలకమని మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పేర్కొన్నారు. శుక్రవారం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ ఏజెంట్లతో సమావేశం నిర్వహించారు. కౌంటింగ్‌కు వెళ్లే ఏజెంట్ల రౌండ్ల వారీగా కౌంటింగ్ వివరాలను గమనించటంతోపాటు ఓటింగ్ పత్రాలను కూడా గమనించాల్సి ఉంటుందన్నారు. కౌంటింగ్‌లో ఎక్కడైనా ఇబ్బందికరంగా ఉంటే వెంటనే అధికారులకు వివరించాలని సూచించారు. సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు కోకి రాఘవరెడ్డి, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు కాగిత సుధీర్‌బాబు, మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, యల్లావుల ఏడుకొండలు, ఉయ్యూరు లీలాశ్రీనివాసరెడ్డి, పార్టీ యువజన విభాగం రాష్ట్రకార్యదర్శి నక్కా వీరారెడ్డి, జిల్లా యువజన నాయకులు కొక్కిలిగడ్డ చెంచయ్య, ఆట్ల నాగేశ్వరరెడ్డి, గంగిశెట్టి రత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
మాజీ డిప్యూటీ స్పీకర్ కోన


