వైఎస్సార్‌సీపీ గెలుచుకున్న వార్డులివే..
చీరాల: చీరాల మున్సిపాలిటీని టీడీపీ కై వసం చేసుకుంది. చీరాల మున్సిపల్ ఎన్నికల్లో పలు వార్డులు టీడీపీ గెలుచుకుంది. ఈనెల 1న మున్సిపల్ ఎన్నికలు జరిగగా శుక్రవారం స్థానిక చీరాల ఇంజనీరింగ్ కాలేజీలో ఎన్నికల కౌంటింగ్‌ను నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన కౌంటింగ్ రాత్రి 8 గంటలకు ముగిసింది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. పోస్టల్ బ్యాలెట్‌లో టీడీపీ 37, వైఎస్సార్ సీపీ 29, కాంగ్రెస్ 13, జనసేన 5, ఇండిపెండెంట్ 5, సీపీఐ 1, బీజేపీ 2, నోటా 1 ఓట్లు వచ్చాయి. అనంతరం బ్యాలెట్ పేపర్లను లెక్కించారు. మొత్తం 44 వార్డులకు గాను 2 రూములు ఏర్పాటు చేశారు. చైర్మన్ అభ్యర్థికి ఒక రూము కేటాయించారు. రూముల్లో ఫెన్సింగ్ ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ హాలులో అభ్యర్థితో పాటు ఒక ఏజెంట్లు మాత్రమే అనుమతి ఇచ్చారు. ఆర్డీఓ ఎస్.నరసింహారావు, మున్సిపల్ కమిషనర్ కె.దానియేల్ జోసఫ్ స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరచిన బ్యాలెట్ బాక్సులను ఆయా కేంద్రాలను పంపించారు. కౌంటింగ్ కేంద్రాన్ని కలెక్టర్ వి.వినోద్‌కుమార్, ఎన్నికల వ్యయ పరిశీలకులు జి.కృష్ణప్రియ పరిశీలించారు. కౌన్సిలర్‌కు రెండు రౌండ్లు చొప్పున 22 వార్డులు కేటాయించారు. పురపోరులో మొత్తం 164 మంది పోటీలో నిలిచారు. 8 వార్డుల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. బీజేపీకి 1, కాంగ్రెస్ 11, ఇండిపెండెంట్ 2, టీడీపీ 22 మంది కౌన్సిలర్లు గెలుపొందారు. అలానే టీడీపీ చైర్మన్ అభ్యర్థి యెరిచర్ల హని స్పందన 6468 ఓట్లుతో విజయం సాఽధించారు. అనంతరం గెలుపొందిన అభ్యర్థులకు ఎన్నికల అధికారి డిక్లరేషన్ ఫారాలను అందించారు. కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ ఎండీ మోయిన్ ఆధ్వర్యంలో ఒన్‌టౌన్, టూటౌన్, రూరల్ సీఐలు సోమశేఖర్, శశికుమార్, సుధాకర్, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.
పూలి అఖిల
షేక్ ఫాతిమా
కొరబండి శాంతి
గొల్లా మాధవి
దేట రామలక్ష్మి
కొనంగుల రేఖారాణి
యర్రా కృష్ణకుమారి
సలగల అమృతరావు
2 వార్డు పూలి అఖిల, మెజార్టీ 203 ఓట్లు
3 వార్డు కొరబండి శాంతి, మెజార్టీ 468
4 వార్డు గొల్లా మాధవి, 334మెజార్టీ
10 వార్డు షేక్ ఫాతిమా, మెజార్టీ 260 ఓట్లు
11 వార్డు దేటా రామలక్ష్మి, మెజార్టీ 77 ఓట్లు
17 వార్డు సలగల అమృతరావు, మెజార్టీ 25 ఓట్లు
18 వార్డు కోనంగుల రేఖారాణి, మెజార్టీ 28 ఓట్లు
34వ వార్డు యర్రా కృష్ణకుమారి, మెజార్టీ 302 ఓట్లు


