ఉపాధ్యాయ ఓటరు నమోదులో నిబంధనలు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయ ఓటరు నమోదులో నిబంధనలు పాటించాలి

Nov 7 2026 2:00 AM | Updated on Nov 7 2026 2:00 AM

డీఈఓకు యూటీఎఫ్‌ వినతి

గుంటూరు ఎడ్యుకేషన్‌: శాసన మండలి కృష్ణా– గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదులో ఎన్నికల కమిషన్‌ నిర్దేశించిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. శుక్రవారం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో డీఈఓ షేక్‌ సలీమ్‌ బాషాకు యూటీఎఫ్‌ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు ఓటు హక్కు కల్పించే విషయంలో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని కోరారు. సర్వీసు సర్టిఫికెట్‌, వేతన ధ్రువపత్రం, పీఎఫ్‌తో పాటు బీఈడీ విద్యార్హతలు గల వారికే ఓటు హక్కు కల్పించాలని కోరారు. బీఈడీ విద్యార్హత లేకుండా, బోధన చేయని టెన్త్‌, ఇంటర్‌ అర్హతలు గల వారికి ఓటర్లుగా నమోదు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. అటువంటి వాటికి ఆస్కారం లేకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. నిబంధనల ప్రకారం అర్హత కలిగిన అందరికీ ఓటు హక్కు కల్పించాలని, అర్హతలు లేని దరఖాస్తులను తిరస్కరించాలని కోరారు. డీఈఓను కలసిన వారిలో యూటీఎఫ్‌ జిల్లా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.కళాధర్‌, జిల్లా సహాధ్యక్షురాలు ఎండీ షకీలా బేగం, జిల్లా కార్యదర్శి పీహెచ్‌ ఆదినారాయణ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement