మేడికొండూరు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గుంటూరు– సత్తెనపల్లి జాతీయ రహదారిపై హైదరాబాద్ నుంచి గుంటూరు వస్తున్న కారు, ఎదురుగా వస్తున్న టాటా బొలెరో వాహనం ఢీకొన్న ఘటన పాలడుగు క్రాస్‌రోడ్డు సమీపంలో జరిగింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న గుంటూరుకు చెందిన మాడగోని శివకృష్ణ(40), బొలెరో డ్రైవర్(అస్సాం)కు చెందిన జక్రిల్ ఇస్లాం(27) అక్కడికక్కడే మృతి చెందారు. బొలెరో డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని సమాచారం. ఘటనపై మేడికొండూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


