వృద్ధురాలు మృతి.. కుటుంబానికి సాయం | - | Sakshi
Sakshi News home page

వృద్ధురాలు మృతి.. కుటుంబానికి సాయం

Nov 4 2026 2:32 AM | Updated on Nov 4 2026 2:32 AM

వృద్ధురాలు మృతి.. కుటుంబానికి సాయం

దగ్గుబాడు (కారంచేడు): తుఫాన్‌ ప్రభావంతో వీచిన పెనుగాలులకు ఇంటి మీద ఏర్పాటు చేసుకున్న వాటర్‌ ట్యాంక్‌ కూలిపోయింది. ఆ ట్యాంక్‌ సిమెంట్‌ మూత పక్కనే ఉన్న రేకుల షెడ్డుపై పడటంతో అందులో నివాసముంటున్న వృద్ధురాలు మృతి చెందింది. ఈ సంఘటన మంగళవారం మండలంలోని దగ్గుబాడు గ్రామంలో చోటుచేసుకుంది. మట్లపూడి తిరుపతమ్మ (66)కు తలకు తీవ్రగాయాలవడంతో ప్రాణాలు కోల్పోయింది. వీఆర్‌ఓ శ్రీలక్ష్మి సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. వైఎస్సార్‌ సీపీ నాయకుడు ముల్లా నూర్‌ అహ్మద్‌ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.రూ.20 వేలు ఆర్థిక సాయాన్ని తిరుపతమ్మ కుమారుడు వెంకటేష్‌కు అందించారు. ఎంపీటీసీ అభ్యర్థి షేక్‌ మౌలాలి తదితరులు వెంట ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement