మొదలైన ‘మురసు’ | - | Sakshi
Sakshi News home page

మొదలైన ‘మురసు’

Nov 3 2026 1:51 AM | Updated on Nov 3 2026 1:51 AM

మంగళవారం శ్రీ 3 శ్రీ నవంబర్‌ శ్రీ 2026 మొదలైన ‘మురసు’ జిల్లాపై తుఫాన్‌ ప్రభావం అధికంగా ఉండే అవకాశం చీరాలలో కౌంటింగ్‌ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి వెండి నాగపడగ సమర్పణ దుర్గమ్మ ఆదాయం రూ.2.45 కోట్లు పులిచింతల సమాచారం ప్రజలు అధైర్యపడొద్దు : ఎస్పీ నేటి సాయంత్రం నుంచి మద్యం దుకాణాలు బంద్‌ వేమూరు సీఐ షేక్‌ నఫీజ్‌ బాషాకు రక్షణ పతకం అవార్డు కొండవీడుకోట సందర్శనకు బ్రేక్‌ శివాలయం ఈఓ శ్రీనివాసులు రెడ్డి బాధ్యతల స్వీకరణ బియ్యం దుకాణాల్లో తనిఖీలు

న్యూస్‌రీల్‌

తుఫాన్‌ ప్రభావంతో ముందుకొచ్చిన సముద్రం భారీగా వీస్తోన్న ఈదురుగాలులు లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను తరలించేందుకు ప్రత్యేక చర్యలు బాపట్లకు చేరుకున్న ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు

బాపట్ల
మంగళవారం శ్రీ 3 శ్రీ నవంబర్‌ శ్రీ 2026
జిల్లాపై తుఫాన్‌ ప్రభావం అధికంగా ఉండే అవకాశం
చీరాలలో కౌంటింగ్‌ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి
మాచర్ల 23వ వార్డులో 59.52 శాతం పోలింగ్‌

7

మోపిదేవి: సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానానికి సోమవారం విజయవాడ వాస్తవ్యులు చిట్టా వెంకట శ్రీనివాస శర్మ 945 గ్రాముల వెండి నాగపడగను కానుకగా సమర్పించారు.

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు దసరా ఉత్సవాల్లో హుండీల ద్వారా రూ.2.45 కోట్ల ఆదాయం లభించిందని అధికారులు పేర్కొన్నారు.

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 4877 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు లీకేజిల ద్వారా వెళుతుంది.

బాపట్ల : మురసు తుఫాన్‌ నేపథ్యంలో ప్రజలు అధైర్యపడవద్దని, ప్రజలకు అండగా జిల్లా పోలీస్‌ యంత్రాంగం ఉంటుందని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్‌ భరోసా కల్పించారు. తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాకు చేరుకున్న ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ అధికారులతో జిల్లా ఎస్పీ సోమవారం క్యాంప్‌ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లాకు చేరుకున్న ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను చీరాల, చిన్నగంజాం, బాపట్ల, రేపల్లె ప్రాంతాల్లో మోహరించారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయక చర్యలు చేపట్టేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. జిల్లాలో 70కి పైగా లోతట్టు ప్రాంతాలను గుర్తించామని, ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 224 మంది పోలీసులతో అప్రమత్తంగా ఉన్నామన్నారు. వేగంగా స్పందించే విధంగా 18 క్యూఆర్‌టీ బృందాలను సిద్ధం చేశామని, అత్యవసర సమయాల్లో సమాచార మార్పిడి, సహాయక చర్యలకు ఎలాంటి ఆటంకం కలగకుండా కమ్యూనికేషన్‌ వ్యవస్థను మరింత పటిష్టం చేసినట్లు తెలిపారు. జిల్లా పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ (8333813228) ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

గుంటూరు వెస్ట్‌: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా మద్యం దుకాణాలు మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి విక్రయాలు నిలుపుదల చేయనున్నట్లు గుంటూరు జిల్లా కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరిషత్‌ పోలింగ్‌ నవంబరు 5వ తేదీన జరుగుతున్నందున, నిబంధనల మేరకు విక్రయాల నిలుపుదల జరుగుతుందన్నారు.

వేమూరు: బాపట్ల జిల్లా వేమూరు పోలీసుస్టేషన్‌ సీఐ షేక్‌ నఫీజ్‌ బాషా అరుదైన జాతీయ స్థాయి గుర్తింపు పొందారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక కేంద్ర హోంమంత్రి రక్షణ పతకం–2026కు దేశ వ్యాప్తంగా ఎంపికై న 123 మంది దర్యాప్తు అధికారుల జాబితాలో ఆయన చోటు దక్కించుకున్నారు. ఈ అవార్డుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నుంచి కేవలం నలుగురు పోలీస్‌ అధికారులు ఎంపిక కాగా వారిలో నఫీజ్‌ బాషా ఒకరు కావడం విశేషం. గుంటూరు పోలీస్‌ రేంజ్‌ నుంచి ఈ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికై న ఏకై క పోలీసు అధికారిగా నిలిచారు. విధి నిర్వహణలో నీతి, నిజాయతీ, అంకితభావంతో పనిచేస్తూ ఉత్తమ ప్రతిభ కనబరిచన నఫీజ్‌ బాషా గతంలోనూ పలు జిల్లా, రాష్ట్ర స్థాయి అవార్డులు అందుకున్నారు. తాజాగా జాతీయ స్థాయి పురస్కారానికి ఎంపిక కావం పోలీస్‌ శాఖకు గర్వకారణంగా నిలిచింది. ఉన్నత పోలీస్‌ అధికారులు ఆయనను అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి పోలీస్‌ శాఖకు మరింత గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు.

యడ్లపాడు: మురసు తుపాను కారణంగా చారిత్రక కొండవీడు కోట సందర్శనకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. కొండపై మట్టి కరిగిపోవడం, బండరాళ్లు జారిపడే అవకాశం ఉండటంతో పర్యాటకుల భద్రత దృష్ట్యా సందర్శనలను రద్దు చేసినట్లు నరసరావుపేట ఫారెస్టు రేంజ్‌ అధికారి డీవీ రమణ తెలిపారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా సోమ, మంగళవారం రెండు రోజులపాటు కొండవీడు కోట సందర్శనను నిలిపివేసినట్లు ఆమె వెల్లడించారు. కొండ దిగువన ఉన్న చెక్‌పోస్టును తాత్కాలికంగా మూసినవేసినట్లు తెలిపారు. తుఫాన్‌ అనంతరం తిరిగి ప్రకటించే వరకు పర్యాటకులు కొండవీడు వైపు రావద్దని, అధికారుల సూచనలను పాటించి సహకరించాలని కోరారు.

పెదకాకాని: మల్లేశ్వరస్వామి దేవస్థాన నూతన కార్యనిర్వహణాధికారిగా పి శ్రీనివాసులురెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం శివాలయం ఈఓగా పనిచేస్తున్న గోగినేని లీలాకుమార్‌ వ్యక్తిగత కారణాలతో రెండు నెలలు సెలవుపై వెళ్లారు. దేవదాయ శాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు దేవదాయశాఖ ఉప కమిషనర్‌ పి శ్రీనివాసులురెడ్డి సోమవారం బాధ్యతలు చేపట్టారు. ముందుగా ఆయన భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వేద పండితులు ఆశీర్వచనం చేశారు. ఈఓగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసులురెడ్డి ప్రస్తుతం ప్రకాశం జిల్లా మాలకొండ శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ఉప కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

నగరంపాలెం: నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణలో భాగంగా సోమవారం బాపట్ల పట్టణం కొండలరావువీధిలోని ఝాన్సీలక్ష్మీ రైస్‌ ట్రేడర్స్‌ దుకాణంలో విజిలెన్‌న్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు, స్థానిక తూనికలు/కొలతల శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పలు రకాలైన బియ్యం, ఇతర సరుకుల ధరలను దుకాణ యాజమాని అల్లం సాంబశివరావుని అడిగి తెలుసుకున్నారు. ఏ రకం బియ్యం ఏ ధరకు విక్రయిస్తున్నారనేది రికార్డులు తనిఖీ చేశారు. బియ్యం బస్తాలపై తయారీదారుని పేరు, ధరల ముద్రణ లేకపోవడంపై లీగల్‌ మెట్రాలజీ కేసులు నమోదు చేశారు.

బాపట్ల: మురసు తుఫాన్‌ ముంచుకొస్తోంది. ఆదివారం అర్ధరాత్రి నుంచే బాపట్ల జిల్లాలో తుఫాన్‌ ప్రభావం స్పష్టంగా కనిపించింది. జిల్లాలోని బాపట్ల, చిన్నగంజాం, చీరాల, వేటపాలెం, కర్లపాలెం, పిట్టలవానిపాలెం, భట్టిప్రోలు, కొల్లూరు మండలాల పరిధిలో తీవ్ర ప్రభావం చూపిస్తోంది. సోమవారం మధ్యాహ్నం నుంచి బాపట్లలో తుఫాన్‌ ప్రభావం చూపించింది. ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. బాపట్ల ప్రాంతంలోని ప్రధాన రోడ్లు సైతం జలమయమయ్యాయి. సూర్యలంక తీరంలో సముద్రం ముందుకొచ్చింది. పోలీసు ఔట్‌పోస్టు వరకు సముద్రపు నీరు చొచ్చుకుని వచ్చింది.

చీమ్మచీకట్లు.. ఈదురుగాలులు

తుఫాన్‌ ప్రభావంతో పట్టపగలు చీమ్మచీకట్లు అలుముకున్నాయి. ఈదురుగాలులు భారీగా వీయటంతో చెట్లు కూలిపోయాయి. మధ్యాహ్నం నుంచి విద్యుత్‌ సరఫరాకు చాలా చోట్ల అంతరాయం కలిగింది. జిల్లాలోని 70 లోతట్టు గ్రామాలను గుర్తించిన అధికారులు వారిని పునరావాస కేంద్రాలను తరలించేందుకు చర్యలు తీసుకున్నారు.

ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాల రాక

తుఫాన్‌ ప్రభావం భారీగా ఉంటుందన్న వాతావరణ శాఖ అంచనాలతో జిల్లాకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు భారీగా చేరుకున్నారు. సూర్యలంక, రామాపురం, ఓడరేవు ప్రాంతాల్లో ఈ ప్రత్యేక బృందాలను నియమించారు. ఈనెల 4వతేదీ వరకు సముద్ర స్నానాలపై నిషేధం విధించారు. పర్యాటకులు ఎవరూ సముద్ర తీరానికి రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు.

నేలకొరిగిన పంటపొలాలు

అర్నబ్‌ తుఫాన్‌ నుంచి బయటపడకముందే మురసు తుఫాన్‌ బాపట్ల తీర ప్రాంతంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈదురు గాలులు, వర్షంతో అరకొరగా వేసుకున్న పంటపొలాలు సైతం తీవ్రంగా దెబ్బతిన్నాయి. తుఫాన్‌ ప్రభావంతో కురిసిన వర్షం జిల్లాలో వరి, అరటి, పసుపు పంటలపై తీవ్ర ప్రభావం చూపింది. పంటపొలాల్లో నీళ్లు చేరుకోవటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.

వరుస తుఫాన్లతో ఇక్కట్లు..

చీరాల టౌన్‌: అర్నబ్‌ తుఫాన్‌ వలన గత వారంలో ఇబ్బందులు పడిన ప్రజలకు మళ్లీ మురసు తుఫాన్‌తో ముసురు పట్టుకుంది. వారం రోజుల వ్యవధిలోనే రెండు పెద్ద తుఫాన్లు రావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తీరప్రాంత గ్రామాల ప్రజలకు భారీ వర్షాల సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని తహసీల్దార్‌ కుర్రా గోపీకృష్ణ తెలిపారు. వాడరేవులో తీర ప్రాంతానికి శుక్రవారం వరకు పర్యాటకులను అనుమతించకుండా రెవెన్యూ, మైరెన్‌, సివిల్‌ పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహించేలా చర్యలు చేపట్టామన్నారు. తహసీల్దార్‌ వెంట గ్రామ వీఆర్వో శేఖర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

చీరాల: చీరాల మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ కె.దానియేల్‌ జోసఫ్‌ తెలిపారు. చీరాల ఇంజినీరింగ్‌ కాలేజీలో మంగళవారం కౌంటింగ్‌కు రూములు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మొత్తం 44 వార్డులకుగానూ 11 మంది ఎలక్షన్‌ ఆఫీసర్లను ఏర్పాటు చేశామన్నారు. ఒక్కో ఎలక్షన్‌ ఆఫీసర్‌కు నాలుగు వార్డుల చొప్పున కేటాయించినట్లు చెప్పారు. ఒక రూమ్‌లో ఆరుగురు ఈఓలకు 12 టేబుళ్లు, మరో రూమ్‌లో ఐదుగురు ఈఓలకు 10 టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఒక రౌండ్‌కు 22 వార్డులు, మరో రౌండ్‌కు 22 వార్డుల చొప్పున కేటాయించారు. చైర్మన్‌ అభ్యర్థులకు 14 రౌండ్‌లు ఉంటాయని, రూములలో ఫెన్సింగ్‌ ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుందని, మీడియా సెల్‌ ఏర్పాటు చేసి ప్రతి వార్డు ఫలితాలను మెసెంజర్‌ ద్వారా అందించనున్నట్లు తెలిపారు. కౌంటింగ్‌ కేంద్రాల ఆవరణలోకి ఎవరినీ అనుమతించమని, గుర్తింపు పాసులు ఉన్నవారిని మాత్రమే అనుమతించడం జరుగుతుందని అన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామన్నారు. అలానే కౌంటింగ్‌ కేంద్రాలు, పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

23వ వార్డు లోని పోలింగ్‌ బూత్‌కు వెళ్లే ప్రధాన రహదారిలో బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు

మాచర్ల: ఆదివారం జరిగిన మాచర్ల పురపాలక సంఘం ఎన్నికల్లో తెలుగుదేశం గూండాలు బూత్‌లు ఆక్రమించడం, రిగ్గింగ్‌లకు పాల్పడడం.. ముఖ్యంగా 23వ వార్డు పోలింగ్‌ కేంద్రంలో సీసీ కెమెరాలు ధ్వంసం చేయడం వంటి ఘటనలకు పాల్పడడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సోమవారం ఆ వార్డులో రీ పోలింగ్‌ నిర్వహించారు. గురజాల ఆర్‌డీఓ మురళీ, డీఎస్పీ ఉమామహేశ్వరరావు, ఎన్నికల అధికారి వేణుబాబులు ఉదయం నుంచే ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకున్నారు. పలువురు సీఐలు, ఎస్‌ఐలతో కలిపి 150 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. ఈ నేపథ్యంలో బూత్‌కు నాలుగు వైపులా పోలీసులను మోహరించి స్లిప్పులను పరిశీలించిన తరువాతనే లోపలికి పంపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మొత్తం 1213 ఓట్లకు గాను 772 ఓట్లు పడ్డాయి. రెండు బూత్‌లు కలిపి మొత్తం 59.52శాతం పోలింగ్‌ నమోదైంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు కఠినంగా వ్యవహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement