వేటపాలెం: మురసు తుఫాన్ కారణంగా వేటపాలెం మండల పరిధిలోని రామాపురం, కఠారివారిపాలెం, పొట్టిసుబ్బయ్యపాలెం బీచ్‌లను నాలుగు రోజుల పాటు మూసివేయనున్నట్లు స్థానిక తహసీల్దార్ గీతారాణి తెలిపారు. సోమవారం మండల పరిధిలోని రామాపురం, పొట్టిసుబ్బయ్యపాలెం, కఠారివారిపాలెం బీచ్‌లను ఆమె సందర్శంచారు. మత్స్యకారులను అప్రమత్తం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లాపై తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో సముద్ర తీరానికి పర్యాటకులు రావద్దని తెలిపారు. దూరప్రాంతాలైన హైదరాబాద్ నుంచి వచ్చే పర్యాటకులు బీచ్‌లకు రావద్దని సూచించారు.


