రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

Nov 3 2026 1:51 AM | Updated on Nov 3 2026 1:51 AM

5న వేతనంతో కూడిన సెలవు నెహ్రూనగర్‌: ఎంపీటీసీ, జెడ్పీటీసీ సాధారణ ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో గుంటూరు జోన్‌ పరిధిలోని దుకాణాలు, వ్యాపార సంస్థలు, ప్రైవేట్‌ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు ప్రభుత్వం వేతనంతో కూడిన సెలవు ప్రకటించిందని కార్మిక శాఖ సంయుక్త కమిషనర్‌ సీహెచ్‌.ఆశరాణి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. జోన్‌ పరిధిలోని గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లోని అన్ని దుకాణాలు, సంస్థల ఉద్యోగులకు ఈ సెలవు వర్తిస్తుందని ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని యాజమాన్యాలు ఈ ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. హెచ్‌ఎంను దూషించిన వ్యక్తికి జైలు, జరిమానా తెనాలిరూరల్‌: పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిని ధూషించిన వాచ్‌మన్‌కు జరిమానా, జైలు శిక్ష విధిస్తూ జడ్జి తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం.. వేమూరు మండలం పెరవలి హైస్కూల్‌లో పనిచేస్తున్న నైట్‌ వాచ్‌మన్‌ పి.హనుమంతరావు సెలవు అవసరమైన నేపథ్యంలో ప్రధానోపాధ్యాయురాలు డి.సరోజినిని సంప్రదించాడు. నిబంధనల ప్రకారం సెలవు విషయమై చర్చిస్తుండగా ఆగ్రహానికి గురైన హనుమంతరావు ఆమెను అసభ్యకర పదజాలంతో ధూషించాడు. ఈ నేపథ్యంలో ఆమె 2024 సెప్టెంబర్‌ 30న వేమూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి వేమూరు ఎస్‌ఐ జి.రవికృష్ణ కేసు నమోదు చేశారు. కేసు సోమవారం విచారణకు రాగా నిందితుడిపై నేరం రుజువు కావడంతో రెండవ అదనపు జడ్జి (జూనియర్‌ డివిజన్‌) గ్రంధి శ్రీనివాస్‌ ఒక సంవత్సరం జైలు, రూ.10 వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్‌ తరపున సీనియర్‌ ఏపీపీ పరిశపోగు సునీల్‌ కుమార్‌ వాదించారు. కోర్టు హెడ్‌ కానిస్టేబుల్‌ రమేష్‌ సహకారం అందించారు. ఏటీఎం కార్డు మార్చి నగదు విత్‌డ్రా ఫిరంగిపురం: ఏటీఎం వద్ద నగదు చూసే క్రమంలో కార్డు మార్చి పలు ప్రాంతాల్లో నగదు డ్రాచేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిరంగిపురం గ్రామానికి చెందిన సీహెచ్‌ కొండయ్యకు లారీ ఉంది. తెనాలి నుంచి హుబ్లీ సరుకు రవాణా చేయగా వాటి తాలూకు కిరాయి నగదు వేశామంటూ అక్కడి వ్యక్తి తెలిపాడు. దీంతో గత నెల 27న సొలస బస్టాండ్‌ సెంటర్‌లోని ఏటీఎం వద్దకు వచ్చి తన వద్ద ఉన్న ఏటీఎం కార్డును బ్యాంకులో నుంచి వస్తున్న ఓ వ్యక్తికి ఇచ్చి నగదు పడ్డాయో లేదో చూడమని చెప్పాడు. పిన్‌కోడ్‌ అడగడంతో రెండుసార్లు చెప్పినా నగదు పడలేదని అతడు కార్డు ఇచ్చి వెళ్లిపోయాడు. దీంతో మరికొన్ని చోట్ల చూసినా నగదు లేదని చెబుతుండటంతో 31వ తేదీ బ్యాంకు వద్దకు వెళ్లి నగదు పడిందో లేదో చూడమని చెప్పడంతో వారు కార్డు ఎవరి పేరు మీద ఉందో చెప్పమన్నారు. తాను చెప్పిన పేరు కాకుండా చర్ల అనే పేరు ఉండటం, అప్పటికే సాతులూరు, నరసరావుపేట, గుంటూరు వంటి ప్రాంతాల్లో సుమారు రూ.71 వేలు డ్రా చేసినట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. ఖంగుతున్న బాధితుడు స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

చీరాల రూరల్‌: హౌరా–తిరుచురాపల్లి ఎక్స్‌ప్రెస్‌ రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం వేటపాలెం రైల్వేస్టేషన్‌ సమీపంలో చోటుచేసుకున్నట్లు జీఆర్పీ ఎస్సై సీహెచ్‌ కొండయ్య తెలిపారు. రైల్వేస్టేషన్‌ యార్డు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి రైలును గమనించకుండా మూడో నంబర్‌ రైలు పట్టాలు దాటుతున్నాడు. వేగంగా వచ్చిన రైలు బలంగా ఢీకొట్టింది. ఈ సంఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుని వయస్సు సుమారు 45 సంవత్సరాలు ఉంటుందని తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చీరాల ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుని ఆచూకీ తెలిస్తే రైల్వే, జీఆర్పీ పోలీసులకు సమాచారం అందించాలని ఆయన సూచించారు.

క్రేన్‌ కిందపడి యువకుడు దుర్మరణం

రోడ్డుపై ఆందోళన చేసిన గ్రామస్తులు

తాడికొండ: రాయపూడి సీడ్‌ యాక్సిస్‌ రోడ్డుపై ఆదివారం రాత్రి హైడ్రాలిక్‌ క్రేన్‌ కింద పడి దొండపాడు గ్రామానికి చెందిన కొండముది ఆనందరావు(35) మృతి చెందాడు. రాయపూడి నుంచి మందడం వైపు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా ఎదురుగా వస్తున్న హైడ్రాలిక్‌ క్రేన్‌ వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తి ఘటనా స్థలంలోనే దుర్మరణం పాలయ్యాడు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు. పోలీసులు వచ్చి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement