బాపట్ల | - | Sakshi
Sakshi News home page

బాపట్ల

Oct 2 2026 3:09 AM | Updated on Oct 2 2026 3:09 AM

శుక్రవారం శ్రీ 2 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026 బలహీన వర్గాలకు టీడీపీ వెన్నుపోటు నిమ్మకాయల ధరలు నాగార్జునసాగర్‌ నీటిమట్టం పులిచింతల సమాచారం భార్య హత్య కేసులో భర్తకు జీవిత ఖైదు

న్యూస్‌రీల్‌

రాజ్యాంగ సవరణతోనే 34 శాతం రిజర్వేషన్లు

బీసీ రిజర్వేషన్లపై సర్కారుకు హైకోర్టు షాక్‌ చట్ట సవరణ అంశాలను జీఓలతో కప్పిపుచ్చిన ప్రభుత్వం బీసీలపై సర్కారు చిత్తశుద్ధిపై సర్వత్రా విమర్శలు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఉమ్మడి జిల్లాలో ఒక్క బీసీకి కూడా నామినేట్‌ పదవి ఇవ్వని వైనం ఇచ్చిన పదవుల్లో 95 శాతం చంద్రబాబు సామాజిక వర్గానికే.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీసీ రిజర్వేషన్‌ మార్చే కుట్ర టీడీపీలోని బీసీలనూ అణగదొక్కేయత్నం

వైఎస్సార్‌ సీపీ హయాంలో పెద్ద పీట

శుక్రవారం శ్రీ 2 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026
బలహీన వర్గాలకు టీడీపీ వెన్నుపోటు

7

తెనాలి: తెనాలి మార్కెట్‌యార్డులో గురువారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.6500, గరిష్ట ధర రూ.9000, మోడల్‌ ధర రూ.8000 వరకు పలికింది.

మాచర్ల: నాగార్జునసాగర్‌ నీటిమట్టం గురువారం సాయంత్రానికి 537.20 అడుగుల మేర ఉంది. రిజర్వాయర్‌కు 27528 క్యూసెక్కులు వచ్చి చేరుతుంది.

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 28.9990 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు లీకేజిల ద్వారా వెళుతుంది.

చీరాల రూరల్‌: భార్యను హత్యచేసిన కేసులో నిందితునికి జీవిత ఖైదుతోపాటు రూ.20,000 జరిమానా విధిస్తూ ప్రకాశం జిల్లా 8వ అదనపు జిల్లా సెషన్స్‌ న్యాయమూర్తి గురువారం తీర్పు వెలువరించినట్లు ఎస్పీ బి.ఉమామహేశ్వర్‌ తెలిపారు. 2014లో చీరాల టూటౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధి ప్రసాద్‌నగర్‌లో నిందితుడైన తలారి కోటేశ్వరరావు తన భార్య ప్రసాదమ్మపై అనుమానం పెంచుకుని తెల్లవారుజామున ఆమె శరీరంపై కిరోసిన్‌ పోసి నిప్పంటించి హత్య చేశాడు. అప్పటికే ఆమెను గతంలో ఎంతో మానసికంగా, శారీరకంగా వేధించాడు. కుల పెద్దలు కూడా అనేకసార్లు ఆమెను వేధించవద్దని హెచ్చరించారు. కానీ నిందితుడు తన వైఖరిని మార్చుకోకుండా ఆమెను చంపడానికి అవకాశం కోసం ఎదురుచూసి ఆమె శరీరంపై కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. దీంతో ఆమె తీవ్రంగా కాలి గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చేరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం చీరాల టూటౌన్‌ పోలీసులు క్రైం నంబర్‌. 118/2014, 498 ఏ, 302 ఐపీసీ సెక్షన్ల్‌ కింది కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టి కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. నిందితులు విచారణ సమయంలో తప్పించుకోకుండా బలమైన సాక్ష్యాధారాలు సేకరించి శిక్ష పడేలా డీఎస్పీ మొయిన్‌, సీఐ శశికుమార్‌ పర్యవేక్షణలో కోర్టు లైజనింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ బాల నాగిరెడ్డి, కోర్టు లైజన్‌ కానిస్టేబుల్‌ ఎం.కిరణ్‌ ఎస్‌కె మూసా కృషి చేశారు. కేసులో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పాలపర్తి శ్రీనారెడ్డి కోర్టులో బలమైన వాదనలు వినిపించి నిందితునిపై మోపిన నేరాన్ని బలమైన సాక్ష్యాలతో నిరూపించారు. న్యాయమూర్తి జీవిత ఖైదు, రూ. 20,000 జరిమానా విధించారు. నిందితునికి శిక్షలుపడేకా కృషి చేసిన పోలీసు అధికారులు సిబ్బందిని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ను, కోర్టులో ధైర్యంగా సాక్ష్యాలు చెప్పిన సాక్షులను ఎస్పీ ఉమా మహేశ్వర్‌ అభినందించారు.

స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు దక్కాలంటే కేంద్రంతో రాజ్యాంగ సవరణ చేయించాలి. తమిళనాడు తరహాలోనే ఏపీ లోనూ రాజ్యాంగ సవరణ ద్వారా రిజర్వేషన్ల పరిమితి పెంచేలా చంద్రబాబు ప్రధాని మోదీపై ఒత్తిడి తేవాలి. ఢిల్లీకి అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని తీసుకెళ్లాలి.

– తాటికొండ నరసింహారావు,

జాతీయ బీసీ బహుజన ఫ్రంట్‌ అధ్యక్షుడు

సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్ర జనాభాలో అధికంగా ఉండే వెనుకబడిన తరగతులు(బీసీ)లపై ప్రభు త్వం మరోమారు తమ కపట వైఖరిని ప్రదర్శించింది. ఎన్నికల సమయంలో మాత్రమే గుర్తుకువచ్చే బీసీ రిజర్వేషన్‌ పెంపుదల అంశంలో కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధి బహిర్గతమైంది. ఆగస్టు 18వ తేదీన బీసీలకు స్థానిక సంస్థల్లో ప్రభుత్వం బీసీలకు ఉన్న రిజర్వేషన్‌ను పెంచి సీట్లు కేటాయిస్తామని గత ఆగస్టులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్భాటంగా ప్రకటించారు. అందుకు అనుగుణంగా రెండు జీఓలను కూడా తీసుకువచ్చారు. అయితే రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం దీనిపై గురువారం కీలకతీర్పు వెల్లడించింది. బీసీలకు గ్రామీణ ప్రాంతాల్లో 34 శాతం, పట్టణ ప్రాంతాల్లో స్థానిక సంస్థలకు 33.33 శాతం రిజర్వేషన్‌లను కల్పిస్తామని తీసుకువచ్చిన జీఓలను కొట్టివేసింది.

సమాచారం సేకరించటంలో విఫలం..

రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్‌ పెంపుదల, ఖరారుకు సీనియర్‌ రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి రాజీవ్‌రంజన్‌ ఆధ్వర్యంలో బీసీ డెడికేషన్‌ కమిషన్‌ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్‌ రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బీసీల వెనుకబాటు తనంపై అనుభవపూర్వక విచారణ, వారి రిజర్వేషన్‌ పెంచే ప్రక్రియ చేయటమే కమిటీ ఉద్దేశం. ఈ కమిటీ సెప్టెంబర్‌ 30 వరకు పనిచేసింది. అయితే కమిటీ పూర్తిస్థాయిలో నివేదికలు ఇవ్వలేదని, సరైన సమాచారం సేకరించటంలో విఫలమైందని, క్షేత్ర స్థాయి పరిశీలన చేయకుండానే ప్రభుత్వం సమర్పించిన నివేదికలను మాత్రమే పరిగణలోకి తీసుకుని నివేదికను సిద్ధం చేసిందనే విమర్శలు ఉన్నాయి.

బీసీలకు బాబు వెన్నుపోటు

టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఉమ్మడి గుంటూరు జిల్లాలో రెండు రాజ్యసభ సీట్లు, ఒక ఎమ్మెల్సీ స్థానం సొంత సామాజిక వర్గ నేతలకే ఇచ్చుకున్న చంద్రబాబు ఏ ఒక్క స్థానంలోనూ బీసీలకు అవకాశం ఇవ్వలేదు. గుంటూరు మిర్చి యార్డు చైర్మన్‌ నుంచి, జీడీసీసీ బ్యాంక్‌ చైర్మన్‌, మేయర్‌, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌, వివిధ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు ఇలా ఇచ్చిన నామినేటెడ్‌ పోస్టులన్నీ సొంత సామాజిక వర్గానికే కేటాయించారు తప్ప.. ఒక్క పోస్టు కూడా బీసీలకు ఇవ్వలేదు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌ అంటూ డ్రామా ఆడుతున్న చంద్రబాబు ఉమ్మడి జిల్లాలో 2 శాతం కూడా ఇవ్వకపోవడం కొసమెరుపు.

గత వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ హయాంలో జిల్లాకు చెందిన బీసీ నాయకుడు మోపిదేవి వెంకటరమణ రేపల్లె నుంచి పోటీ చేసి ఓటమి పాలైనప్పటికీ, తొలుత ఎమ్మెల్సీ ఇచ్చి, మంత్రిగా అవకాశం కల్పించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆతరువాత ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చి బీసీలకు పెద్ద పీట వేశారు. జిల్లాకు చెందిన బీసీ నేత విడదల రజినికి మంత్రివర్గంలో స్థానం కల్పించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా గుంటూరు మిర్చి యార్డు చైర్మన్‌గా, గుంటూరు వెస్ట్‌ నుంచి ఓటమి పాలైన బీసీ నేత చంద్రగిరి ఏసురత్నంకు ఇచ్చి, అనంతరం ఆయనకు ఎమ్మెల్సీగా సైతం అవకాశం కల్పించారు. ఆయన్ను మార్చిన తరువాత కూడా మరో బీసీ నేత నిమ్మకాయల రాజనారాయణకు యార్డు చైర్మన్‌గా అవకాశం కల్పించారు. మంగళగిరికి చెందిన బీసీ నేత మురుగుడు హనుమంతరావుకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. జిల్లా కో–ఆపరేటీవ్‌ మార్కెటింగ్‌ సొసైటీ చైర్మన్‌గా బీసీ మహిళ యార్లగడ్డ భాగ్యలక్ష్మికి అవకాశం కల్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement