రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

Jun 8 2026 7:12 AM | Updated on Jun 8 2026 7:12 AM

నకరికల్లు: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన అద్దంకి–నార్కెట్‌పల్లి రాష్ట్ర రహదారిపై నకరికల్లు సమీపంలో ఆదివారం జరిగింది. సంఘటనకు సంబంధించి ఎస్‌ఐ కె.సతీష్‌ తెలిపిన వివరాలు ఇలాఉన్నాయి. నకరికల్లుకు చెందిన వాకాటి నాగరాజు(18) అతని మిత్రుడు ద్విచక్రవాహనంపై నకరికల్లు నుంచి పిడుగురాళ్ల వైపు వెళ్తున్నారు. వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడిపోయింది. ఇదే క్రమంలో వెనుక నుంచి వస్తున్న కంటైనర్‌ లారీ వాకాటి నాగరాజును వేగంగా ఢీకొంది. తీవ్రగాయాలైన నాగరాజు అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ కె.సతీష్‌ ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఘటనపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement