
30 నుంచి రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలు
సత్తెనపల్లి: ఈ నెల 30, 31వ తేదీలలో మహిళలకు రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలను సత్తెనపల్లి మండలం ధూళ్ళిపాళ్ల సమీపంలోని లయోలా ఇంజినీరింగ్ కళాశాలలో ఈ నెల 30, 31వ తేదీలలో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఉమ్మడి గుంటూరు జిల్లా అమోచ్యూర్ సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఇ. వంశీకృష్ణారెడ్డి, పి.సామంత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆహ్వానపత్రాన్ని డీఎన్‌ఆర్ ఫౌండేషన్ ఛైర్మన్ దరువూరి నాగేశ్వరరావు తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ పోటీలకు ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కోన రవి కుమార్, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఎ.రవి నాయుడు హజరవుతారన్నారు. 13 జిల్లాల టీములు పాల్గొంటాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో సహాయ కార్యదర్శి నర్రా శ్రీనివాసరావు, అడ్మిషన్ డైరెక్టర్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.