
శ్రీశైల గాయత్రి పీఠాఽధిపతిగా రామారావు
వేటపాలెం: శ్రీశైల గాయత్రి పీఠాధిపతులుగా రావూరిపేటకు చెందిన జ్యోతిర్విద్వాస్.. దేవాంగ పురోహిత పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు, విశ్రాంత ఉపాధ్యాయుడు చల్లా రామారావు ఎంపికయ్యారు. దేవాంగ కుల ద్వితీయ గురు పీఠం శ్రీశైలం గాయత్రి పీఠం అని, పీఠం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 26న చీరాల్లో పూర్తి చేసినట్లు ప్రధాన కార్యదర్శి అంబాబత్తుల అండకొండ రాముడు గురువారం వెల్లడించారు. ప్రస్తుతం తాత్కాలికంగా ఈ పీఠాన్ని రావూరిపేటలో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అన్ని కార్యక్రమాలు పూర్తయిన తర్వాత శ్రీశైలంలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. పీఠం సభ్యులు చల్లా లక్ష్మణరావు, పన్నెం బాలశఽంకరరావు, సజ్జా విశ్వనాఽథ్ పాల్గొన్నారు.
ఐదుగురు జూదరుల అరెస్ట్
కారంచేడు: మండలంలోని స్వర్ణ గ్రామంలో ఐదుగురు జూదరులను పోలీస్‌లు అరెస్ట్ చేశారు. గురువారం గ్రామంలోని సమీప పశువుల కొష్టాల వద్ద పేకాడుతున్నట్లు వచ్చిన సమాచారంతో తమ సిబ్బందితో దాడి చేసినట్లు ఎస్‌ఐ షేక్ ఖాదర్‌బాషా తెలిపారు. పేక ముక్కలతో పాటు, సెల్‌ఫోన్‌లు, రూ. 1120 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు.
31న జిల్లాస్థాయి
టెన్నికాయిట్ పోటీలు
నరసరావుపేట రూరల్: ఉమ్మడి గుంటూరు జిల్లా టెన్నికాయిట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 31వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు లింగంగుంట్ల శంకరభారతీపురం జెడ్పీ హైస్కూల్‌లో జూనియర్, సబ్ జూనియర్, సీనియర్ టెన్నికాయిట్ ఆటల పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు అసోసియేషన్ అధ్యక్షుడు నిడికొండ జానకిరామయ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలలో ప్రతిభావంతులైన క్రీడాకారులను ఎంపిక చేసి సెప్టెంబర్ 13, 14వ తేదీలలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటలో జరిగే రాష్ట్ర స్థాయి సీనియర్ పోటీలకు పంపనున్నట్లు పేర్కొన్నారు. సబ్ జూనియర్ విభాగంలో క్రీడాకారులు 01–01–2011, జూనియర్ విభాగంలో పాల్గొనే వారు 01–01–2007 తరువాత పుట్టిన వారై ఉండాలని తెలిపారు. పోటీలకు హాజరయ్యే వారు వయసు ధ్రువీకరణపత్రంతో రావాలని సూచించారు. పూర్తి వివరాలకు పి.తిరుపతిరావు – 97016 18000, ఝాన్సీరాణి – 99495 33234 ఫోను నంబర్లలో సంప్రదించాలని తెలిపారు.