
స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ఎదుర్కొందాం
బాపట్ల: విద్యుత్ ఛార్జీల వ్యతిరేక పోరాటంలో 2000 సంవత్సరంలో హైదరాబాదులో బషీర్ బాగ్ వద్ద అమరులై రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామిల స్ఫూర్తితో స్మార్ట్ మీటర్లును రద్దు చేసేంతవరకు పోరాటం కొనసాగించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి సిహెచ్ గంగయ్య అన్నారు. గురువారం వామపక్ష పార్టీలు ఇతర ప్రజా సంఘాల నాయకులతో కలిసి బాపట్ల పాత బస్టాండ్ సెంటర్లో స్మార్ట్ మీటర్లు రద్దు అయ్యే వరకు పోరాటం ఆగదని ప్రతిజ్ఞ చేశారు. గంగయ్య మాట్లాడుతూ ఈ విద్యుత్ చార్జీల నిలువు దోపిడీని అరికట్టడానికి ప్రజల్ని పెద్ద సంఖ్యలో కదిలించాలని అందుకు వామపక్ష పార్టీలు ఇతర ప్రజా సంఘాలను కలుపుకొని ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. ఒక్కో మీటర్‌కు రూ. 30వేలు ఖర్చుపెట్టి మీటర్ల బిగించిన అనంతరం ఆ సొమ్ము మన వద్దే వాయిదాల పద్ధతిలో వసూలు చేస్తారన్నారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా నాయకులు మజుందార్, కొండయ్య, శరత్, కోటేశ్వరరావు, నాగేశ్వరరావు, భాస్కర్ రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రవి, బీఎస్పీ నాయకులు రాజారావు, సమాజ్‌వాది పార్టీ నాయకులు శ్రీనివాసరావు పాల్గొన్నారు.