
23 నుంచి గోవాడలో కోటి కుంకుమార్చన
అమృతలూరు(భట్టిప్రోలు): అమృతలూరు మండలం గోవాడ శైవ క్షేత్రమైన శ్రీ గంగాపార్వతి సమేత శ్రీ బాలకోటేశ్వరస్వామి వారి దేవస్థానంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర శ్రావణ బహుళ అమావాస్య నుంచి 11 అమావాస్యలు పురస్కరించుకుని కోటి కుంకుమార్చన, సామూహిక లలిత పారాయణ మహోత్సవం జరుగుతుందని కార్యనిర్వాహణాధికారి బి. అశోక్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆగస్టు 23న సెప్టెంబర్, అక్టోబర్ 21న, నవంబర్, డిసెంబర్ 19న, 2026 జనవరి 18న, ఫివ్రవరి 17న, మార్చి 18, ఏప్రియల్ 17న, మే 16న, జూన్ 14న అమావాస్య పూజలు నిర్వహిస్తున్నట్లు ప్రధాన అర్చకులు స్వర్ణ వెంకట శ్రీనివాసశర్మ, అర్చకులు చావలి శ్రీధర్ శర్మ, పొన్నపల్లి సత్యనారాయణ, ప్రత్తిపాటి రామకోటేశ్వరరావు తెలిపారు. ప్రతి నెలా 10 లక్షల పారాయణ, కుంకుమార్చన, అమ్మవారికి శ్రీ సూక్త సహిత దేవి ఉపనిషత్తులతో అభిషేకం, కుంకుమార్చన, దేవి హోమం, కుష్మాండ పూజ, కూష్మాడబలి పూజా కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. కోటి కుంకుమార్చన కమిటీ, సహాయకులు కార్యక్రమాలను పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు.

23 నుంచి గోవాడలో కోటి కుంకుమార్చన