
వినాయకచవితి ఉత్సవాలకు అనుమతి తప్పనిసరి
ఆన్‌లైన్‌లోనే మండపాలకు అనుమతి జిల్లా ఎస్పీ తుషార్ డూడీ
బాపట్లటౌన్: వినాయకచవతి ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం ఎస్పీ తుషార్ డూడీ విలేకరులతో మాట్లాడారు. ఉత్సవాలకు, మండపాల ఏర్పాటుకు ఆన్‌లైన్‌లో అనుమతులు తీసుకోవాలన్నారు. ఎటువంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. పబ్లిక్ ప్రదేశాల్లో మండపాలు, పందిళ్లు ఏర్పాటు చేసి వినాయక విగ్రహాలు ప్రతిష్టించుకునే భక్తుల సౌకర్యార్థం సులభంగా అనుమతులు పొందేందుకు సింగిల్‌విండో విధానాన్ని పోలీస్ శాఖ ప్రవేశపెట్టిందన్నారు. http://fanerhutrav.net అనే వెబ్‌సైట్‌ను పోలీస్ శాఖ ప్రారంభించిందన్నారు.
మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా ఈ వెబ్‌సైట్ ద్వారా సింగిల్ విండో విధానంలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని అనుమతులు పొందాలన్నారు. దరఖాస్తుదారుడు పోలీస్ స్టేషన్లు, కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు. సంబంధిత పోలీస్ అధికారి స్వయంగా పందిరి, మండప స్థలాన్ని తనిఖీ చేస్తారన్నారు. నిబంధనల ప్రకారం ఉంటే క్యూఆర్ కోడ్‌తో కూడిన నిరభ్యంతర పత్రాన్ని (ఎన్‌ఓసీ) జారీ చేస్తారన్నారు. వినాయక ఉత్సవాలను శాంతియుతంగా, భద్రతాపరమైన నియమ నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలన్నారు. పబ్లిక్ ప్రదేశాల్లో అనుమతి లేకుండా వినాయక మండపాలు, పందిళ్లు ఏర్పాటు చేయరాదన్నారు.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడం ఇలా...
http://fanerhutrav.net వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి దరఖాస్తుదారుడు అతడి ఫోన్ నెంబర్ నమోదు చేయాలి.