
విద్యుదాఘాతంతో కార్మికుడు మృతి
ప్రైవేటు వెంచర్‌లో డస్ట్ అన్‌లోడ్ చేస్తుండగా ఘటన
తాడికొండ: హై టెన్షన్ విద్యుత్ తీగలు తగిలి విద్యుదాఘాతంతో కార్మికుడు మృతి చెందిన ఘటన తాడికొండ అడ్డరోడ్డులో జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం... తాడికొండ అడ్డరోడ్డులోని ఓ ప్రైవేటు వెంచర్‌లో బెంజ్ లారీ నుంచి డస్ట్ అన్‌లోడ్ చేసేందుకు పైనున్న హైటెన్షన్ విద్యుత్ తీగలు తప్పించబోయాడు. ఈ క్రమంలో విద్యుత్ షాక్ తగిలినట్లు సమాచారం. ఘటనా స్థలంలోనే కార్మికుడు కుప్పకూలడంతో గుంటూరు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీనిపై ఇప్పటి వరకు పోలీస్‌స్టేషన్‌కు ఎలాంటి సమాచారం అందలేదు.
ప్రమాదానికి కారణమైన విద్యుత్ తీగెలు

విద్యుదాఘాతంతో కార్మికుడు మృతి