
నీట్ పీజీలో మెరిసిన పూనూరు విద్యార్థి
యద్దనపూడి: మెడికల్ విభాగంలో బుధవారం ప్రకటించిన నీట్ పీజీ పరీక్ష ఫలితాల్లో యద్దనపూడి మండలం పూనూరు గ్రామానికి చెందిన డాక్టర్ ఐలవరపు శృతి జాతీయ స్థాయిలో 3716వ ర్యాంకును సాధించారు. మొత్తం 2,42,000 మంది అభ్యర్థులు రాసిన నీట్ పీజీ ఎంట్రన్స్ పరీక్షలో శృతి 3716వ ర్యాంక్ సాధించారు. పూనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తిచేసిన శృతి మొదటి నుంచి చదువులో అగ్రగామిగా ఉండేవారు. 2018 నీట్ యూజీ ఎంట్రన్స్ పరీక్షలో రాష్ట్ర స్థాయి మొదటి పది మంది విజేతల్లో ఒకరుగా నిలిచి గుంటూరు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. గైనకాలజీ పూర్తి చేయటం ద్వారా పేద ప్రజలకు సేవలు అందించటం తన లక్ష్యమని శృతి తెలిపారు. శృతి తండ్రి హనుమంతరావు ఆరోగ్య శాఖలో ఉద్యోగి కాగా తల్లి హిమబిందు ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. తల్లిదండ్రులు, సోదరి ప్రణయ, పూనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.
నీట్ పీజీలో 5850 ర్యాంక్ సాధించిన రాచూరు వాసి
భట్టిప్రోలు: భట్టిప్రోలు మండలం రాచూరు గ్రామానికి చెందిన దీవి శ్రీసాయి హేమంత్ నీట్ పీజీ 2025లో 578 మార్కులు 5850 (ఆల్ ఇండియా) ర్యాంక్ సాధించారు. 2018లో నీట్ ఎంట్రన్స్ పరీక్షలో నేషనల్ 20 వేలు, రాష్ట్రంలో 1011 ర్యాంక్ సాధించాడు. గుంటూరు కాటూరి మెడికల్ కాలేజీలో ఉచిత సీట్ పొంది 2018–2024లో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. హేమంత్ తండ్రి శ్రీనివాస హరికుమార్ న్యాయవాదిగా, తల్లి అనంత శైలజ సచివాలయ మహిళా పోలీస్‌గా పనిచేస్తున్నారు. హేమంత్‌ను తాత విశ్రాంత తెలుగు పండిట్ దీవి వేంకట లక్ష్మీ నరసింహాచార్యులు, కుటుంబ సభ్యులు అభినందించారు.
జాతీయ స్థాయిలో 3716వ ర్యాంకు కై వసం

నీట్ పీజీలో మెరిసిన పూనూరు విద్యార్థి