
వ్యవసాయ శాఖ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ మూత
వేమూరు: రైతులు సాగు చేస్తున్న పంటలకు వాడే విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల నాణ్యతను పరీక్ష చేసేందుకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌ను కూటమి ప్రభుత్వం మూత వేసింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గం కేంద్రంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యాన అగ్రిటెస్టింగ్ ల్యాబ్ ఏర్పాటు చేసింది. అందులో భాగంగానే వేమూరు నియోజకవర్గంలోని మార్కెట్ యార్డులో ల్యాబ్‌ను నిర్మించారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల నాణ్యతను పరిశీలించేందుకు ఇద్దరు విస్తరణాధికారులను నియమించారు. 2023– 2024 వరకు ప్రభుత్వం అందిస్తున్న ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు టెస్టింగ్ ల్యాబ్ ద్వారా పరిశీలించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌ను మూత వేసేందుకు కుట్ర పన్నింది. ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు టెస్టింగ్ ల్యాబ్‌కు రాకపోవడంతో వ్యవసాయ శాఖ అధికారులు మూత వేశారు. కూటమి ప్రభుత్వం వ్యవసాయ శాఖ అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌ను తెరిపించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
జె.పంగులూరు: వర్షాకాలం వచ్చిందని నల్లబర్లీ పొగాకు సక్రమంగా కొనుగోలు జరిగేలా చూడాలని రైతు సంఘం బాపట్ల జిల్లా కార్యదర్శి తలపనేని రామారావు ప్రభుత్వాన్ని కోరారు. పంగులూరు గ్రామంలో శనివారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో రామారావు మాట్లాడారు. రైతులు ఇప్పటికే పొగాకు మడేలు కట్టి సుమారు ఆరు నెలలైందని, పొగాకు నాణ్యత లోపించిందని తెలిపారు. మార్క్‌ఫెడ్ అధికారులు కూడా నాణ్యత ప్రమాణాలు బట్టి క్వింటా పొగాకు రూ.6 వేలు నుంచి రూ.9 వేలకు మించి కొనుగోలు చేయడం లేదని అన్నారు. 30 శాతం వరకు పొగాకు బేళ్లు రిజెక్ట్ చేస్తున్నారని, తద్వారా రైతులు ఎకరాకు రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకు నష్టపోతున్నారన్నారు. గ్రామాల్లో కొంత మంది రైతుల పేర్లు రాక, మండెలు అలానే ఉన్నాయని, స్టాక్ గోదాంలు లేవని ఈ వారం కొనుగోలు నిలిపివేశారన్నారు. మొదట ప్రారంభించిన కొనుగోలు కేంద్రాల్లోనే కొనుగోలు జరపాలని, అక్కడి నుంచి మార్కెఫెడ్ వారు వేరే ప్రాంతాలను తరలించుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రైతులు నష్టపోయారని.. దూరప్రాంతాలకు పొగాకు బేళ్లు తీసుకురావాలని కోరడం భావ్యం కాదని, ప్రభుత్వమే ఖర్చు భరించాలని కోరారు. కొనుగోలు ప్రారంభించి సుమారు 60 రోజులైనా ఇంతవరకు రైతుల ఖాతాల్లో డబ్బులు జమకాలేదన్నారు. కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పారని, ఆ హామీ అమలు కాలేదని రామారావు అన్నారు.
తెనాలి రూరల్: గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్ చెందిన రౌడీషీటర్ వేము నవీన్‌పై పీడీ యాక్ట్ నమోదైంది. జిల్లా కలెక్టర్, మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు అతడిని అదుపులోకి తీసుకుని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించినట్లు తెనాలి టూటౌన్ సీఐ రాములనాయక్ శనివారం తెలిపారు. నవీన్‌పై గతంలో కొట్లాట, దోపిడీ, గంజాయి కేసులు నమోదయ్యాయి. ఇటీవల కానిస్టేబుల్ కన్నా చిరంజీవిపై దాడి కేసులో నవీన్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శాంతి భద్రతల పరిరక్షణ, రౌడీషీటర్లపై తీసుకుంటున్న చర్యల్లో భాగంగా నవీన్‌పై పీడీ యాక్టు నమోదైందని సీఐ వివరించారు. శాంతి భద్రతలకు విఘాతం కల్గించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
కర్లపాలెం: కర్లపాలెంలో కాలువ వంతెనకు సైడ్‌వాల్స్ లేకపోవటంతో ఓ కారు కాలువలోకి బోల్తాపడింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు శనివారం కర్లపాలెంలోని బాపయ్య కొట్టు ఎదుట పాత ఇస్లాంపేటకు వెళ్లే ఇసుక చానల్ వంతెనపై నుంచి ఓ కారు కాలువలోకి బోల్తా పడింది. ప్రమాద సమయంలో కాలువలో నీరు ఉండటం వల్ల కారులో ఉన్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు.

వ్యవసాయ శాఖ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ మూత

వ్యవసాయ శాఖ అగ్రి టెస్టింగ్ ల్యాబ్ మూత