
లారీని ఢీకొట్టిన ట్రావెల్ బస్సు
గుడ్లూరు: ముందు వెళ్తున్న లారీని వెనుక వైపు నుంచి కావేరి ట్రావెల్ బస్సు ఢీ కొనడంతో బస్సులో ఉన్న క్లీనర్ మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం తెల్లవారుజామున తెట్టు ఓవరు బ్రిడ్జి దగ్గర జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఒంగోలు వైపు నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న కావేరి ట్రావెల్ బస్సు అదే మార్గంలో ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు క్లీనరు ఉండ్రరాశి సంతోష్ (27) మృతి చెందాడు. మృతుడు సంతోష్‌ది కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం పెద ఓగిరాల గ్రామం. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు గుడ్లూరు ఎస్‌ఐ వెంకట్రావు తెలిపారు.
క్లీనరు మృతి