
ఆదమరిస్తే అంతే సంగతులు
బల్లికురవ: సాగర్ కాలువకు నీటి విడుదల సమయంలో హైలెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టడం సమస్యగా మారింది. డైవర్షన్ రోడ్డులో వర్షం కురిసిన సమయంలో జారుడు బల్లలా మారుతోంది. ఆదమరిస్తే 20 అడుగుల లోతులో ఉన్న కాలువలో పడాల్సిందే. బల్లికురవ– అద్దంకి ఆర్‌అండ్‌బీ రోడ్డులోని వల్లాపల్లి–ధర్మవరం గ్రామం మధ్య అద్దంకి బ్రాంచ్ కాలువ 33/0 వద్ద.. గతంలో ఉన్న పాత బ్రిడ్జి స్థానంలో హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.1.65 కోట్లు జూన్ మాసాంతంలో మంజూరయ్యాయి. ఇప్పటికీ పనులు పూర్తికాకపోవడంతోపాటు సాగర్ కాలువ నీటి విడుదలతో కొంత జాప్యం జరిగింది. డైవర్షన్ రోడ్డుకు బురద మట్టి తోలడంతో పాటు గ్రానైట్ ఎగమతి చేసే ఖాళీ భారీ వాహనాలు కూడా ఈ డైవర్షన్ రోడ్డు ద్వారానే రాకపోకలు సాగించడంతో గోతులు ఏర్పడ్డాయి. భారీ వాహనాల రాకపోకలు నిషేధం అంటూ బల్లికురవ అద్దంకి, అంబడిపూడి వద్ద బోర్డులు పెట్టి అధికారులు చేతులు దులుపుకున్నారు. ఇప్పటికై నా పనులు వేగవంతం చేయడంతో పాటు డైవర్షన్ రోడ్డులో ఏర్పడ్డ గోతులకు ఎర్రమట్టి తోలి రాకపోకలకు ఇబ్బందులు తొలగించాలని వాహన చోదకులు, ప్రజలు వేడుకుంటున్నారు.
వల్లాపల్లి వద్ద డైవర్షన్ రోడ్డులో
పొంచి ఉన్న ప్రమాదం

ఆదమరిస్తే అంతే సంగతులు