
కారంచేడుకు కీర్తి..
స్వాతంత్రోద్యమంలో 18 మంది కారంచేడు యోధులు
కారంచేడు: 78 ఏళ్ల కిందట మనకు వచ్చిన స్వాతంత్య్రం వెనుక ఎంతో మంది శ్రమ, దీక్ష, పోరాటాలు, ప్రాణ త్యాగాలు ఉన్నా యి. అప్పటి మన స్వాతంత్య్ర పోరాటాల్లో కారంచేడుకు చెందిన 18మంది యోధులు పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ పిలుపుతో వీరంతా అప్పటి దండి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. గ్రామంలో పాత శివాలయం వద్ద వీరు సమావేశమైనట్టు చరిత్ర చెబుతోంది. ఉప్పు సత్యాగ్రహంలో వీరందరూ జైలు జీవితం గడిపారు. అప్పట్లో ఒక సారి చీరాలకు వచ్చిన మహాత్మాగాంధీని కూడా కలిసి సత్యాగ్రహం గురించి చర్చించారు. వీరికి గ్రామానికి చెందిన యనమండ్ర వెంకటసుబ్బయ్య పంతులు, పోతిని వెంకటసుబ్బయ్య పంతులు, కారంచేటి మల్లయ్య పంతులు నాయకత్వం వహించినట్లు చరిత్ర చెబుతోంది. దండి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న వారిలో దగ్గుబాటి నాయుడమ్మ, యార్లగడ్డ వెంకన్నచౌదరి, పోతిన వెంకన్నచౌదరి, గోరంట్ల లింగయ్యచౌదరి, యార్లగడ్డ అంజయ్యచౌదరి, గొట్టిపాటి శ్రీరాము లు, పోతిన వెంకయ్యచౌదరి, నాళం సుబ్బారావుగుప్తా, యార్లగడ్డ చినలక్ష్మయ్య, యార్లగడ్డ మునసుబుగారి సుబ్బరాయుడు, మండవ మల్ల య్య, దగ్గుబాటి సుబ్బన్నచౌదరి, జాగర్లమూడి వెంకటకృష్ణయ్య చౌదరి, తవ్వా వెంకటసుబ్బయ్య గుప్తా, జాగర్లమూడి వెంకటకృష్ణయ్య చౌదరిలు పాల్గొన్నట్లు చరిత్ర చెబుతుంది.

కారంచేడుకు కీర్తి..