ఇనాం భూములు, ఎస్టేట్ల సమస్యలకు పరిష్కారం
చినగంజాం (పర్చూరు): జిల్లాలో ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న ఇనాం భూములు, ఎస్టేట్ సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ బి.సుబ్బారావు ఆదేశించారు. శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఏదుబాడు, చెన్నుబొట్ల అగ్రహారం గ్రామ రైతులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు వెయ్యి మంది రైతులు ఇనాం భూ సమస్యల వల్ల ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. వాటిని వెంటనే పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకోవాలని జేసీ అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించిన పలు రికార్డులను ఆయన శుక్రవారం పరిశీలించారు. కార్యక్రమంలో బాపట్ల ఆర్డీఓ రవీందర్, తహసీల్దార్ బ్రహ్మయ్య, రైతులు పాల్గొన్నారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ సుబ్బారావు


