Weekly Horoscope: 14 ఆగస్టు నుంచి 20 ఆగస్టు 2022 వరకు

Weekly Horoscope Telugu 14-08-2022 To 20-08-2022 - Sakshi

మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఏ పని చేపట్టినా పూర్తి చేసే వరకూ విశ్రమించరు. ఆదాయానికి లోటు లేకుండా గడుపుతారు. పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడంలో విజయం సాధిస్తారు. ఉద్యోగార్థులు ఆశించిన ఉద్యోగాలు పొందుతారు.  వ్యాపారాలలో  నైపుణ్యాన్ని నిరూపించుకుంటారు. ఉద్యోగాలలో కొత్త పోస్టులు రావచ్చు. కళాకారులు తమ అనుభవాలతో మరింత రాణిస్తారు. వారం చివరిలో వ్యయప్రయాసలు.  లేత గులాబీ, పసుపు.. తూర్పుదిశ ప్రయాణాలు కలసివస్తాయి. శ్రీఉమాదేవి స్తోత్రాలు పఠించండి.

వృషభం (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
ఎంతటి పని అయినా పట్టు్టదలతో పూర్తి చేస్తారు.  నూతన విద్యలు, ఉద్యోగావకాశాలు దక్కి ఉత్సాహంతో గడుపుతారు. ఆస్తులు కొనుగోలులో ప్రతిష్ఠంభన తొలగుతుంది.  ధనసంపాదనలోనూ మెరుగుదల కనిపిస్తుంది. వ్యాపారాలలో సత్తా, అనుభవాలను చాటుకుని ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. పారిశ్రామికవర్గాలకు చిక్కులు తొలగుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. గులాబీ, లేత పసుపు.. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.

మిథునం (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
మీ మంచితనం, సహనమే మీకు అండగా నిలుస్తుంది. విద్యార్థులు లక్ష్యాల బాటలో పయనిస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు  ముమ్మరం చేస్తారు.  ఉద్యోగాలు దక్కి నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. వ్యాపారాలలోని వారు తమ సత్తా చాటుకుని ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు చేపడతారు. రాజకీయవర్గాలకు సంతోషకర సమాచారం. వారం ప్రారంభంలో అనారోగ్యం. మానసిక ఆందోళన.ఎరుపు, సిమెంట్‌.. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
అనుకున్న పనులు తక్షణం పూర్తి చేయాలన్న తపనతో ముందడుగు వేస్తారు.  ఆదాయం గతం కంటే మరింత మెరుగ్గా ఉండి అవసరాలు తీరతాయి. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలు మిశ్రమంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో మీ శక్తిసామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి. కళారంగం వారి ఆశలు నెరవేరతాయి. వారం మధ్యలో వృథా ఖర్చులు.  ఎరుపు, లేత గులాబీ.. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీశివాష్టకం పఠించండి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
అనుకున్నదే తడవుగా కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. భవిష్యత్తుపై విద్యార్థులకు మరింత భరోసా ఏర్పడుతుంది.  అనుకున్న ఆదాయానికి లోటు లేకుండా గడుపుతారు. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. ధార్మిక చింతన మరింత పెరుగుతుంది. వ్యాపారాలలో ఆశించిన లాభాలు దక్కవచ్చు. రాజకీయవర్గాలకు చిరకాల స్వప్నం నెరవేరుతుంది. వారం మధ్యలో మనశ్శాంతి లోపిస్తుంది. అనారోగ్యం. ఆకుపచ్చ, తెలుపు.తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణం చేయండి.

కన్య (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. అదనపు ఆదాయ వనరులు సమకూరతాయి.  జీవితాన్ని మలుపు తిప్పే ఒక సంఘటన ఎదురుకావచ్చు. నిరుద్యోగులకు ఊహించనిరీతిలో ఉద్యోగాలు రావచ్చు. వ్యాపారాలలో మీరు ఊహించిన అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగాలలో మీదే పైచేయిగా నిలుస్తుంది. పారిశ్రామికవర్గాల కృషి ఫలిస్తుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువుల నుంచి విమర్శలు. ఆకుపచ్చ, నీలం.. ఉత్తరదిశ ప్రయాణాలు  అనుకూలం. శ్రీమహాలక్ష్మీ పంచరత్నావళి పఠించండి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఎంతటి నిర్ణయమైనా మరో ఆలోచన లేకుండా తీసుకుంటారు. భవిష్యత్తుపై విద్యార్థులకు భరోసా కలుగుతుంది. చేపట్టిన పనులు  దిగ్విజయంగా సాగుతాయి. ఆస్తుల కొనుగోలులో ప్రతిష్ఠంభన తొలగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు. వాహనసౌఖ్యం కలుగుతుంది. వ్యాపారాలలో మీ అంచనాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో శ్రమ ఫలిస్తుంది. కళారంగం వారికి సత్కారాలు. వారం మధ్యలో వ్యయం. ఆకుపచ్చ, ఎరుపు..పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీమీనాక్షిస్తుతి పఠించండి.

వృశ్చికం (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆత్మవిశ్వాసం, నేర్పుతో ముందుకు సాగడం మంచిది. గృహం,  వాహనాలు కొనుగోలు చేయడంలో ఆటంకాలు తొలగుతాయి. రాబడి సంతృప్తినిస్తుంది. స్థిరాస్తి వివాదాలను మరింత నేర్పుగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో మీ అంచనాలకు తగిన లాభాలు దక్కవచ్చు. రాజకీయవర్గాలకు మరింత ఆదరణ లభిస్తుంది. వారం ప్రారంభంలో శ్రమాధిక్యం. నీలం, నలుపు..పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీశివపంచాక్షరి పఠించండి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
కొత్త పనులు చేపడతారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలు వృద్ధి దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. పారిశ్రామికవర్గాల వారు సత్తా చాటుకుంటారు. విద్యార్థులు లక్ష్యాల సాధనలో విజయం సాధిస్తారు. వారం మధ్యలో కుటుంబంలో చికాకులు. ధనవ్యయం. నీలం, సిమెంట్‌.. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీసుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
అనుకున్న పనులు ముందుకు సాగక నిరాశ చెందుతారు. ఆదాయానికి మించిన ఖర్చులు.   ఒక వ్యక్తి  కొంత సహాయపడి మన్ననలు అందుకుంటాడు. వ్యాపారాలలోని వారు ఆచితూచి ముందుకు సాగడం మంచిది. ఉద్యోగాలలోని వారు ఇష్టంలేకున్నా మార్పులు చూడాల్సిన పరిస్థితి. రాజకీయవర్గాల కృషి ఫలించక నిరాశ చెందుతారు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనాలు కొనుగోలు చేస్తారు. లేత పసుపు, ఎరుపు.. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీదత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వస్తులాభాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. వ్యాపారాలలో ముందడుగు వేసి లబ్ధి పొందుతారు. ఉద్యోగాలలో అనూహ్యమైన మార్పులు జరుగవచ్చు. పారిశ్రామికవర్గాలు పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. నలుపు, లేత ఆకుపచ్చ.. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠిస్తే మంచిది.

మీనం (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. విద్యార్థులకు అనుకున్న లక్ష్యాలు నెరవేరతాయి. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. కళారంగం వారికి ఊహించని అవకాశాలు. వారం మధ్యలో ఆరోగ్యభంగం. కుటుంబంలో ఒత్తిడులు. బాధ్యతలు పెరుగుతాయి. నేరేడు, బిస్కెట్‌.. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top