
మేషం....
ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. రుణబాధల నుంచి బయటపడతారు. పనులు విజయవంతంగా సాగుతాయి. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు కుదుర్చుకుంటారు. అందరిలోనూ గౌరవం పొందుతారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. బంధువర్గంతో వివాదాలు కొంత వరకూ సర్దుబాటు కాగలవు. భూ, గృహయోగాలు. ఆలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగులు ఆశించిన ఉద్యోగాలను సాధిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగులకు ఒత్తిడుల నుంచి విముక్తి. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం చివరిలో కుటుంబసమస్యలు. అనారోగ్యం. పసుపు, నేరేడురంగులు. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
వృషభం....
ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితుల సాయం అందుతుంది. ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. సోదరులు, సోదరీలతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు. ఆలయాలు సందర్శిస్తారు. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. గృహ నిర్మాణాలు చేపడతారు. చర్చల్లో పురోగతి సాధిస్తారు. వ్యాపారాలు కొంత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో మార్పులు జరుగుతాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. మానసిక అశాంతి. ఖర్చులు. ఎరుపు, తెలుపు రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.
మిథునం....
అనుకున్న పనులు పూర్తి చేస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. మిత్రులు ముఖ్య వ్యవహారాలలో చేయూతనిస్తారు. విలువైన సమాచారం అందుతుంది. విద్యార్థులు అనుకున్న ఫలితాలు పొందుతారు. ఆర్థిక విషయాలలో చిక్కులు తొలగుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు ఉంటాయి. పారిశ్రామికవర్గాల యత్నాలలో పురోగతి. వారం ప్రారంభంలో ధనవ్యయం. బంధువిరోధాలు. ఎరుపు, లేత పసుపు రంగులు. శ్రీలక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి.
కర్కాటకం...
అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆప్తుల సలహాలు స్వీకరించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. విదేశీ విద్యావకాశాలు దక్కే సూచనలు. బంధువులతో వివాదాలు సర్దుకుంటాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. కళారంగం వారికి సత్కారాలు. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. తెలుపు, నేరేడు రంగులు. దేవీఖడ్గమాల పఠించండి.
సింహం....
వ్యతిరేకులను కూడా మీవైపునకు ఆకర్షిస్తారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో కష్టసుఖాలు విచారిస్తారు. భూవివాదాలు పరిష్కరించుకుంటారు. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. వివాహాది వేడుకలకు హాజరవుతారు. వ్యాపారాలు ఒడిదుడుకులు లేకుండా సాగుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఊహించని పదవులు దక్కవచ్చు. వారం చివరిలో వ్యయప్రయాసలు. మిత్రులతో వివాదాలు. ఎరుపు, పసుపు రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.
కన్య..
పనులు సకాలంలో చకచకా పూర్తి కాగలవు. ప్రముఖులతో పరిచయాలు మరింత ఉత్సాహాన్నిస్తాయి. సంఘంలో విశేష ఆదరణ లభిస్తుంది. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. గృహæ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు, నిరుద్యోగులు సత్తా చాటుకుని గుర్తింపు పొందుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులు ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. కళారంగం వారికి సన్మానయోగం. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ఎరుపు, నేరేడు రంగులు. పంచముఖ ఆంజనేయస్తోత్రాలు పఠించండి.
తుల....
ఇంతకాలం పడిన శ్రమ ఫలించే సమయం. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. యుక్తితో కొన్ని ఇబ్బందులు, సమస్యల నుంచి బయటపడతారు. ఊహించని∙ఆహ్వానాలు రాగలవు. స్థిరాస్తి వృద్ధి. ఉద్యోగ యత్నాలు మరింత సానుకూలమవుతాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగులకు అనుకున్న ఇంక్రిమెంట్లు లభిస్తాయి. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ధనవ్యయం. అనారోగ్యం. తెలుపు, లేత నీలం రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.
వృశ్చికం....
ఉత్సాహంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. విద్యార్థుల ఊహలు నిజం చేసుకుంటారు. ఆస్తి వివాదాల నుంచి నేర్పుగా బయటపడతారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబసమస్యలు తీరతాయి. వ్యాపారాలు నూతన పెట్టుబడులతో పుంజుకుంటాయి. ఉద్యోగులు తమ నైపుణ్యాన్ని చాటుకుంటారు. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో స్వల్ప అనారోగ్యం. ధనవ్యయం. గులాబీ, లేత పసుపు రంగులు. నృసింహస్తోత్రాలు పఠించండి.
ధనుస్సు...
ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా ఏదోవిధంగా అవసరాలు తీరతాయి. ఆప్తులతో అకారణంగా తగాదాలు. ఆరోగ్యపరమైన చికాకులు ఎదురవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు కొంత నిరాశ తప్పదు. పనులు ముందుకు సాగక డీలా పడతారు. మిత్రులు, వాహనాలు నడిపే వారు కొంత అప్రమత్తంగా మెలగాలి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు పెరుగుతాయి. కళారంగం వారి ప్రయత్నాలలో ఆటంకాలు. వారం మధ్యలో శుభవార్తలు. విందువినోదాలు. గులాబీ, లేతఆకుపచ్చ, గణేశాష్టకం పఠించండి.
మకరం...
కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో విశేష గౌరవం. ఆస్తుల వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. బాకీలు సైతం అందుతాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఆటంకాలు తొలగుతాయి. పారిశ్రామికవర్గాల యత్నాలు సఫలం. వారం చివరిలో కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. ఆకుపచ్చ, నీలం రంగులు. నవగ్రహస్తోత్రాలు పఠించండి.
కుంభం...
ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. బంధువులతో వివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. దైవదర్శనాలు చేసుకుంటారు. విద్యార్థులకు అనూహ్యమైన ఫలితాలు రావచ్చు. సోదరులతో సఖ్యత. వ్యాపార లావాదేవీలలో పురోగతి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. రాజకీయవర్గాలయత్నాలు సఫలం. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. మిత్రులతో మాటపట్టింపులు. గులాబీ, తెలుపు రంగులు. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
మీనం...
ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. బంధువులు, మిత్రుల సలహాలతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు. సంఘంలో గౌరవం మరింత పెరుగుతుంది. నిరుద్యోగులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. వాహన, కుటుంబసౌఖ్యం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు రాగలవు. పారిశ్రామికవేత్తలకు అరుదైన అవకాశాలు. వారం చివరిలో దూరప్రయాణాలు. ఒత్తిడులు. లేనిపోని ఖర్చులు. గులాబీ, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.