ఈ రాశివారు ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.. | Today Horoscope Telugu-02-11-2021 | Sakshi
Sakshi News home page

ఈ రాశివారు ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు..

Nov 2 2021 6:19 AM | Updated on Nov 2 2021 6:19 AM

Today Horoscope Telugu-02-11-2021 - Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు ఆశ్వయుజ మాసం, తిథి బ.ద్వాదశి ఉ.8.24 వరకు, తదుపరి త్రయోదశి, నక్షత్రం ఉత్తర ఉ.9.48 వరకు, తదుపరి హస్త వర్జ్యం సా.5.56 నుండి 7.31 వరకు, దుర్ముహూర్తం ఉ.8.19 నుండి 9.05 వరకు, తదుపరి రా.10.28 నుండి 11.19 వరకు అమృతఘడియలు... రా.3.16 నుండి 4.51 వరకు, ధనత్రయోదశి.

సూర్యోదయం :    6.02
సూర్యాస్తమయం    :  5.26
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు 

మేషం: నిరుద్యోగులకు శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. ముఖ్యమైన నిర్ణయాలు. వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. నూతన పరిచయాలు.  వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. ఉద్యోగాలలో హోదాలు.

వృషభం: కుటుంబసమస్యలు. స్వల్ప అనారోగ్యం. పనుల్లో కొంత జాప్యం. సోదరుల కలయిక. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో పొరపాట్లు.

మిథునం: చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. ఆరోగ్యసమస్యలు.  వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగాలలో కొన్ని చిక్కులు.

కర్కాటకం: ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. ఇంటాబయటా ప్రోత్సాహం. ఉద్యోగయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత పురోగతి సాధిస్తారు.

సింహం: శ్రమ మరింత తప్పదు. పనులలో ఆటంకాలు. సోదరుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలలో నిరాశ చెందుతారు. ఉద్యోగాలలో కొత్త వివాదాలు. ధనవ్యయం.

కన్య: పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో  పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

తుల: మిత్రులతో విభేదాలు. స్వల్ప అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. దూరప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం.

వృశ్చికం: ఇంటర్వ్యూలు అందుతాయి. పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

ధనుస్సు: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. ఉద్యోగావకాశాలు దక్కుతాయి. సంఘంలో  పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

మకరం: శ్రమ కొంత పెరుగుతుంది. పనుల్లో కొన్ని ఇబ్బందులు. బంధువర్గంతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు,  ఉద్యోగాలలో గందరగోళం.

కుంభం: రుణయత్నాలు సాగిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. స్వల్ప అనారోగ్యం. సోదరులతో విభేదాలు. వ్యాపారాలలో ఆటుపోట్లు. ఉద్యోగాలలో వివాదాలు.

మీనం: పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల నుంచి ముఖ్య సందేశం. ఆకస్మిక ధనలాభం. వాహనయోగం. వ్యాపారాలు,  ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement