Horoscope Today: September 30, 2022 In Telugu - Sakshi
Sakshi News home page

ఈ రాశివారికి ఆత్మీయుల నుంచి శుభవార్తలు.. వాహనయోగం

Published Fri, Sep 30 2022 6:35 AM

Today Horoscope 30-09-2022 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు ఆశ్వయుజ మాసం, తిథి: శు.పంచమి రా.10.37 వరకు, తదుపరి షష్ఠి నక్షత్రం: «విశాఖ ఉ.6.28 వరకు, తదుపరి అనూరాధ, వర్జ్యం: ఉ.10.19 నుండి 11.50 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.15 నుండి 9.04 వరకు తదుపరి ప.12.15 నుండి 1.03 వరకు, అమృతఘడియలు: రా.7.23 నుండి 8.57 వరకు.

సూర్యోదయం :    5.53
సూర్యాస్తమయం    :  5.49
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుండి 4.30 వరకు
 

మేషం: ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. మిత్రులతో మాటపట్టింపులు. పనుల్లో ప్రతిబంధకాలు. వ్యాపారాలు నిరాశ. ఉద్యోగాలలో బదిలీలు.

వృషభం: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహార విజయం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూలత.

మిథునం: కుటుంబంలో ఉత్సాహవంతంగా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనూహ్యమైన మార్పులు.

కర్కాటకం: శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. బంధువిరోధాలు. ఆరోగ్య సమస్యలు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. మానసిక అశాంతి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

సింహం: ప్రయాణాలలో అవరోధాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో విభేదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.

కన్య: మిత్రులతో ఉత్సాహంగా  గడుపుతారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆస్తిలాభం. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

తుల: కుటుంబ, ఆరోగ్యసమస్యలు. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. మిత్రులతో అకారణ వైరం. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.

వృశ్చికం: సన్నిహితుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. వ్యవహారాలలో విజయం. పోటీపరీక్షల్లో విజయం. దైవదర్శనాలు. వస్తులాభాలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉధ్యోగాలలో ప్రోత్సాహం.

ధనుస్సు: రుణభారాలు పెరుగుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో సమస్యలు. బంధువులతో తగాదాలు. పనులు వాయిదా  వేస్తారు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.

మకరం: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. ప్రముఖులతో చర్చలు ఫలిస్తాయి. సంఘంలో గౌరవం. వ్యాపారాలు మరింత అనుకూలం. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.

కుంభం: సన్నిహితుల నుంచి కీలక సమాచారం. పోటీపరీక్షల్లో విజయాలు. వస్తులాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. విచిత్ర సంఘటనలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.

మీనం: మిత్రులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. అనారోగ్య సూచనలు. దూరప్రయాణాలు. శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు నిరాశాజనకంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

Advertisement
Advertisement