ఇవాల్టి దినఫలాలు: ఈ రాశివారు శుభవార్తలు వింటారు.. పనులు సజావుగా సాగుతాయి

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం
శరదృతువు, ఆశ్వయుజ మాసం, తిథి: బ.నవమి ఉ.11.47 వరకు,
తదుపరి దశమి,
నక్షత్రం: పుష్యమి ఉ.6.58 వరకు
తదుపరి ఆశ్లేష,
వర్జ్యం: రా.9.03 నుండి 10.46 వరకు
దుర్ముహూర్తం: ప.11.20 నుండి 12.09 వరకు
అమృతఘడియలు: లేవు.
సూర్యోదయం : 5.56
సూర్యాస్తమయం : 5.34
రాహుకాలం : ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుంచి 9.00 వరకు
మేషం: వ్యవహారాలలో స్వల్ప అవరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువుల నుండి ఒత్తిడులు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.
వృషభం: శ్రమపడ్డా ఫలితం ఉంటుంది. నూతన విద్యావకాశాలు. ప్రముఖులతో చర్చలు. వస్తులాభాలు. ప్రయాణాలలో కొత్త పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.
మిథునం: వ్యవహారాలు నెమ్మదిగా సాగుతాయి. ఆప్తులతో అకారణ వైరం. దూరప్రయాణాలు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలించవు.
కర్కాటకం: ఆశ్చర్యకర సంఘటనలు. వస్తు, వస్త్రలాభాలు. ప్రముఖుల నుండి ముఖ్య సమాచారం. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.
సింహం: పనుల్లో మరింత జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.
కన్య: ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది. వ్యవహారాలలో పురోగతి. భూలాభాలు. ఇంటర్వ్యూలు అందుతాయి. బంధువుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ ఊహలు ఫలిస్తాయి.
తుల: బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సన్నిహితుల నుండి సహకారం అందుతుంది. పనులు సమయానికి పూర్తి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ సత్తా చాటుకుంటారు.
వృశ్చికం: మీ కష్టానికి ఫలితం కనిపించదు. భూవివాదాలు. ఆర్థిక పరిస్థితి కొంత చికాకు పరుస్తుంది. వ్యయప్రయాసలు. మిత్రులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని వివాదాలు.
ధనుస్సు: ఆర్థిక ఇబ్బందులతో సతమతం. ఆలోచనలు నిలకడగా సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.
మకరం: కార్యజయం. శుభవార్తా శ్రవణం. ఆప్తుల నుండి ముఖ్య సమాచారం. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.
కుంభం: కొత్త పరిచయాలు. ఆర్థికంగా బలపడతారు. వాహనయోగం. సేవాభావంతో కార్యక్రమాలు చేపడతారు. స్థిరాస్తివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.
మీనం: వ్యవహారాలు నిదానిస్తాయి. ప్రయాణాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. కొన్ని బాధ్యతలు మీదపడతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణస్థాయిలో ఉంటాయి.