ఈ రాశి వారికి అన్నింటా విజయమే, వస్తులాభం

Today Horoscope 09 11 2022 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, తిథి: బ.పాడ్యమి సా.4.02 వరకు, తదుపరి విదియ, నక్షత్రం: «కృత్తిక రా.2.51 వరకు, తదుపరి రోహిణి, వర్జ్యం: ప.2.13 నుండి 3.55 వరకు, దుర్ముహూర్తం: ప.11.20 నుండి 12.05 వరకు,

అమృతఘడియలు: రా.12.18 నుండి 1.57వరకు;
రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకు,
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు;
సూర్యోదయం 6.05;
సూర్యాస్తమయం 5.23.
 

మేషం: వ్యయప్రయాసలతోనే వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆత్మీయులతో కలహాలు. బంధువుల తాకిడి పెరుగుతుంది. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

వృషభం: పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకర విషయాలు గ్రహిస్తారు. మీలో సేవాభావం పెరుగుతుంది. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

మిథునం: కొత్తగా చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. ప్రయాణాలలో అవాంతరాలు. ఆర్థికంగా ఇబ్బందిపడతారు. ఆరోగ్యపరమైన చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

కర్కాటకం: కోరుకున్న ఉద్యోగావకాశాలు రావచ్చు. ప్రముఖులతో పరిచయాలు. ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ నుండి బయటపడతారు.

సింహం: వ్యవహారాలు అనుకూలిస్తాయి. శ్రమ ఫలించి లక్ష్యాలు సాధిస్తారు. నూతన విద్యావకాశాలు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

కన్య: బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి అంతగా కలసిరాదు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త వివాదాలు.

తుల: సన్నిహితులతో విభేదిస్తారు. అనుకోని ఖర్చులు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.

వృశ్చికం: శుభవర్తమానాలు అందుతాయి. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తులతో మంచీచెడ్డా విచారిస్తారు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింతగా ప్రోత్సాహం.

ధనుస్సు: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వాహనయోగం. కొన్ని చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలు మీ అంచనాల మేరకు సాగుతాయి.

మకరం: వ్యవహారాలలో ఆటంకాలు. కుటుంబసమస్యలు వేధిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. కొన్ని విషయాలలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

కుంభం: అనుకున్న పనులు వాయిదా వేస్తారు. ప్రయాణాలలో అవాంతరాలు. ఖర్చులు మరింత పెరుగుతాయి. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగించవచ్చు.

మీనం: శుభవార్తలు అంది ఉత్సాహంగా గడుపుతారు. కుటుంబంలో సమస్యలు తీరతాయి. పనులు చకచకా పూర్తి. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రతిభ చాటుకుంటారు.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top