Today Telugu Rasi Phalalu: Daily Horoscope 06-08-2022- Sakshi
Sakshi News home page

Today's Horoscope Telugu: ఈ రాశివారు ఓర్పుతో ఉండండి.. విజయం మీదే..

Published Sat, Aug 6 2022 6:58 AM

Today Horoscope 06-08-2022 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి శు.నవమి రా.9.36 వరకు, తదుపరి దశమి నక్షత్రం విశాఖ ప.2.34 వరకు, తదుపరి అనూరాధ వర్జ్యం సా.6.21 నుండి 7.56 వరకు దుర్ముహూర్తం ఉ.5.44 నుండి 7.24 వరకు అమృతఘడియలు... ఉ.6.06 నుండి 7.38 వరకు.

సూర్యోదయం :    5.43
సూర్యాస్తమయం    :  6.28
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు
 

మేషం: కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ధనవ్యయం. శ్రమాధిక్యం తప్పదు. కొన్ని కార్యక్రమాలలో కొద్దిపాటి ఆటంకాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. ఆలయ దర్శనాలు.

వృషభం: నూతన పరిచయాలు. సంఘంలో గౌరవం. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. విందువినోదాలు. వ్యాపారవృద్ధి. .

మిథునం: ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. వాహనయోగం. చర్చలు ఫలిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

కర్కాటకం: బంధువులతో వివాదాలు. అనారోగ్యం. ఇంటాబయటా ఒత్తిడులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం. విద్యార్థుల కృషి అంతగా ఫలించదు.

సింహం: ఓర్పుతో ముందుకు సాగండి. పనులు వాయిదా పడతాయి. ఆలోచనలు కలసిరావు. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. 

కన్య: ఆర్థికంగా బలం చేకూరుతుంది. శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. దైవదర్శనాలు.

తుల: పనుల్లో తొందరపాటు. ఇంటాబయటా ఒత్తిడులు. బంధువులు, మిత్రులతో వివాదాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. విద్యార్థులకు నిరుత్సాహం.

వృశ్చికం: కుటుంబసౌఖ్యం. విలువైన సమాచారం. బంధువుల నుంచి ధనలాభం. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. వాహనయోగం. 

ధనుస్సు: వ్యవహారాలలో ఆటంకాలు. ధనవ్యయం. ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. మిత్రులతో వివాదాలు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

మకరం: కొత్త వ్యక్తుల పరిచయం. చిన్ననాటి మిత్రుల కలయిక. వస్తులాభాలు. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. 

కుంభం: కొత్త పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ఇంటర్వ్యూలు అందుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార వృద్ధి..

మీనం: పనుల్లో తొందరపాటు. బాధ్యతలు అధికమవుతాయి. బంధువులతో వివాదాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. దైవచింతన.



 

Advertisement
Advertisement