ఈ రాశివారికి ఆరోగ్యం కొంత సహకరించదు.. మిత్రులతో కలహాలు

Today Horoscope 04-11-2022 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, తిథి: శు.ఏకాదశి రా.7.02 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం: పూర్వాభాద్ర రా.1.47 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర, వర్జ్యం: ఉ.8.55 నుండి 10.26 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.21 నుండి 9.04 వరకు, తదుపరి ప.12.07 నుండి 12.54 వరకు, అమృతఘడియలు: సా.6.07 నుండి 7.38 వరకు, ప్రబోధనైకాదశి; రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు, యమగండం : ప.3.00 నుండి 4.30 వరకు; సూర్యోదయం 6.03; సూర్యాస్తమయం 5.26. 

మేషం: కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల ద్వారా ఆహ్వానాలు. విందువినోదాలు. సంఘంలో గౌరవమర్యాదలు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత సానుకూలం.

వృషభం: సన్నిహితుల సాయంతో పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వాహనయోగం. చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మిథునం: పనుల్లో ప్రతిబంధకాలు. రుణాలు చేయాల్సి వస్తుంది. బంధువులతో విభేదాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు.

కర్కాటకం: పరిస్థితుల ప్రభావంతో పనులు వాయిదా వేస్తారు. ప్రయాణాలు వాయిదా. శ్రమా«ధిక్యం. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానిస్తాయి.

సింహం: కార్యక్రమాలలో విజయం. శుభవార్తలు అందుతాయి. పరిచయాలు విస్తృతమవుతాయి. మీ ఆలోచనలు అమలు చేసే సమయం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా ఉంటుంది.

కన్య: కొన్ని బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పనులు విజయవంతంగా సాగుతాయి. దైవదర్శనాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు.

తుల: పనుల్లో అవాంతరాలు. కుటుంబసమస్యలు చికాకు పరుస్తాయి. శ్రమ తప్పదు. మిత్రులతో కలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు. దైవదర్శనాలు.

వృశ్చికం: రాబడికి మించి ఖర్చులు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. వ్యవహారాలలో అవాంతరాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మార్పులు.

ధనుస్సు: సన్నిహితుల నుండి ధనలబ్ధి. కీలక నిర్ణయాలు. పరిచయాలు పెరుగుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

మకరం: బంధువులతో తగాదాలు. ప్రయాణాలలో ఇబ్బందులు. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

కుంభం: కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం. శుభవార్తలు వింటారు. కీలక నిర్ణయాలు. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అంచనాల మేరకు ఉంటాయి.

మీనం: రుణబాధలు. దూరప్రయాణాలు. ఆస్తుల విషయంలో చికాకులు. ఆరోగ్యం కొంత సహకరించదు. మిత్రులతో కలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా సాగుతాయి.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top