ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.. వ్యాపార వృద్ధి | Rasi Phalalu: Daily Horoscope On 23 Feb 2025 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.. వ్యాపార వృద్ధి

Feb 23 2025 5:13 AM | Updated on Feb 23 2025 7:19 AM

Rasi Phalalu: Daily Horoscope On 23 Feb 2025 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం,శిశిర ఋతువు, మాఘ మాసం, తిథి: బ.దశమి ఉ.10.30 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం: మూల ప.3.51 వరకు, తదుపరి పూర్వాషాఢ, వర్జ్యం: ప.2.11 నుండి 3.51 వరకు, తదుపరి రా.1.46 నుండి 3.22 వరకు, దుర్ముహూర్తం: సా.4.32 నుండి 5.20 వరకు, అమృతఘడియలు: ఉ.9.00 నుండి 10.43 వరకు; రాహుకాలం: సా.4.30 నుంచి 6.00 వరకు, యమగండం: ప.12.00 నుంచి 1.30 వరకు, సూర్యోదయం: 6.27, సూర్యాస్తమయం: 6.00. 

మేషం...ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. పనుల్లో ప్రతిబంధకాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

వృషభం...రుణాలు చేస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. బంధువులతో స్వల్ప వివాదాలు. ధనవ్యయం. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

మిథునం...పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. విద్యార్థులకు మంచి ఫలితాలు. పనులలో విజయం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

కర్కాటకం...కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. వస్తు, వస్త్రలాభాలు. కీలక నిర్ణయాలు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.

సింహం....ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. వ్యయప్రయాసలు. మిత్రులతో స్వల్ప వివాదాలు. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం.

కన్య....వ్యయప్రయాసలు. మిత్రులతో మాటపట్టింపులు. ధనవ్యయం. వృత్తి, వ్యాపారాలలో మార్పులు. ఆరోగ్యభంగం. కుటుంబంలో చికాకులు.

తుల....కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.

వృశ్చికం....పనులలో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు. బంధువులతో మాటపట్టింపులు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

ధనుస్సు...కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. ఉద్యోగయోగం. వ్యాపార వృద్ధి.

మకరం....వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. బంధువులు, మిత్రులతో స్వల్ప వివాదాలు. ధనవ్యయం.

కుంభం....నూతన ఉద్యోగప్రాప్తి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. వాహనయోగం.

తుల....
మీనం...బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఇంటాబయటా మీదే పైచేయి. సంఘంలో గౌరవం. పలుకుబడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement