
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి: బ.దశమి సా.6.13 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం: రోహిణి ఉ.5.40 వరకు, తదుపరి మృగశిర రా.3.51 వరకు, వర్జ్యం: ఉ.10.26 నుండి 11.56 వరకు, దుర్ముహూర్తం: ప.12.29 నుండి 1.19 వరకు, తదుపరి ప.3.00 నుండి 3.50 వరకు,అమృత ఘడియలు: రా.7.31 నుండి 9.02 వరకు.
సూర్యోదయం : 5.46
సూర్యాస్తమయం : 6.21
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు
మేషం... ప్రయాణాలు వాయిదా వేస్తారు. పనులలో అవాంతరాలు. రుణాలు చేయాల్సివస్తుంది. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా సాగుతాయి.
వృషభం... నూతన ఉద్యోగాలు దక్కుతాయి. పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఇంటాబయటా అనుకూలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యల పరిష్కారం.
మిథునం.... వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్య సూచనలు. బంధువుల నుంచి ఒత్తిడులు.
కర్కాటకం.... చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వస్తులాభాలు. నూతన పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త మార్పులు.
సింహం.... పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సంఘంలో పేరుప్రతిష్ఠలు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ధన, వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.
కన్య.... శ్రమ తప్పదు. పనులు కొన్ని మధ్యలో నిలిపివేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
తుల.... కొత్త రుణయత్నాలు సాగిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని వివాదాలు.
వృశ్చికం... కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో చర్చలు. ఆలోచనలు అమలు చేస్తారు. దైవదర్శనాలు. ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి.
ధనుస్సు... నూతన పరిచయాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని పాత బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో విజయాలు సాధిస్తారు.
మకరం..... పనుల్లో కొంత జాప్యం. సోదరులతో వివాదాలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.
కుంభం.. సోదరులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ఏ పని చేపట్టినా ముందుకు సాగక నిరాశ చెందుతారు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చికాకులు.
మీనం.... శుభకార్యాల ప్రస్తావన. ఆర్థికాభివృద్ధి. భూవివాదాల పరిష్కారం. ఆహ్వానాలు అందుతాయి. కొన్ని వ్యవహారాలలో శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలమైన సమయం.