
గ్రహం అనుగ్రహం: విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువువైశాఖ మాసం, తిథి: బ.చవితి రా.2.31 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం: మూల ప.2.02 వరకు, తదుపరి పూర్వాషాఢ, వర్జ్యం: ప.12.19 నుండి 2.02 వరకు, తదుపరి రా.12.06 నుండి 1.46 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.05 నుండి 8.56 వరకు, తదుపరి ప.12.21నుండి 1.12 వరకు, అమృత ఘడియలు: ఉ.7.10 నుండి 8.44 వరకు.
సూర్యోదయం : 5.32
సూర్యాస్తమయం : 6.20
రాహుకాలం : ఉ.10.30
నుండి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుండి 4.30 వరకు
మేషం: కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆదాయం అంతగా కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారులకు ఒత్తిళ్లు. ఉద్యోగులకు అదనపు పనిభారం. పారిశ్రామికవేత్తలకు చికాకులు.
వృషభం: కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కార్యక్రమాలలో అవాంతరాలు. ఆదాయం అంతగా ఉండదు. వ్యాపారులకు కొద్దిపాటి లాభాలు. ఉద్యోగులకు శ్రమాధిక్యం. రాజకీయవేత్తలకు పర్యటనలు వాయిదా.
మిథునం: ముఖ్య కార్యాలలో విజయం. ఆప్తుల నుంచి కీలక సమాచారం. ఇంటిలో శుభకార్యాలు. ఆకస్మిక ధనలాభం. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారులకు ఒత్తిడులు తొలగుతాయి. ఉద్యోగులు అనుకున్న హోదాలు దక్కించుకుంటారు. పారిశ్రామికవేత్తల యత్నాలు ఫలిస్తాయి.
కర్కాటకం: చిరకాల కోరిక నెరవేరుతుంది. ఆశయాలు నెరవేరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు. కళాకారులకు సత్కారాలు.
సింహం: కొన్ని కార్యాలు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. అరోగ్యసమస్యలు. దేవాలయ దర్శనాలు. వ్యాపారులకు ఒడిదుడుకులు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. పారిశ్రామికవేత్తలకు చికాకులు.
కన్య: కష్టమే మిగులుతుంది. అనుకున్న కార్యాలలో అవాంతరాలు. వృథా ఖర్చులు. దూరప్రయాణాలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారులకు ఒత్తిడులు. ఉద్యోగులకు పనిభారం. రాజకీయవేత్తలకు పర్యటనలు వాయిదా.
తుల: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగుల సేవలకు గుర్తింపు రాగలదు. పారిశ్రామికవేత్తల యత్నాలు సఫలం.
వృశ్చికం: అప్పులు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. దేవాలయ దర్శనాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. శారీరక రుగ్మతలు. వ్యాపారులకు సమస్యలు. ఉద్యోగులకు బదిలీ సూచనలు. కళాకారులకు గందరగోళంగా ఉంటుంది.
ధనుస్సు: శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. కార్యజయం. ఆప్తుల నుంచి అందని సమాచారం సంతోషం కలిగిస్తుంది. వాహనసౌఖ్యం. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు కొంత ఊరట లభిస్తుంది. కళాకారులకు ప్రోత్సాహం.
మకరం: రాబడికి మించిన ఖర్చులు. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. వ్యాపారులకు లాభాలు కనిపించవు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. రాజకీయవర్గాలకు నిరుత్సాహం.
కుంభం: రాబడి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారులు మరింత లాభపడతారు. ఉద్యోగులకు సమస్యలు తీరతాయి. కళాకారులకు కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు.
మీనం: కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆశ్చర్యకర సంఘటనలు. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు వీడతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో వివాదాలు తీరతాయి. రాజకీయవేత్తలు కొత్త అంచనాలతో ముందుకు సాగుతారు.