
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు; శ్రావణ మాసం; తిథి: బ.సప్తమి రా.1.24 వరకు, తదుపరి అష్టమి; నక్షత్రం: అశ్విని ప.10.09 వరకు, తదుపరి భరణి; వర్జ్యం: ఉ.6.24 నుండి 7.54 వరకు, తదుపరి రా.7.05 నుండి 8.34 వరకు; దుర్ముహూర్తం: ఉ.8.17 నుండి 9.07 వరకు,తదుపరి ప.12.30 నుండి 1.20 వరకు; అమృత ఘడియలు: తె.4.01 నుండి 5.31 వరకు (తెల్లవారితే శనివారం).
సూర్యోదయం : 5.45
సూర్యాస్తమయం : 6.24
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుండి 4.30 వరకు
మేషం... కొత్త కార్యక్రమాలు చేపడతారు. కుటుంబ వివాదాలు పరిష్కారం. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులు కొత్త ఆశలు.
వృషభం... ఆకస్మిక ప్రయాణాలు. ఇంటా బయటా సమస్యలు. మానసిక అశాంతి. బంధువర్గంతో విరోధాలు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు స్థాన చలనం.
మిథునం... ఆసక్తికర సమాచారాలు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి.
కర్కాటకం... నూతన ఉద్యోగయోగం. మిత్రుల నుంచి కీలక సమాచారం. రాబడి పెరుగుతుంది. వ్యాపార లావాదేవీలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు ఉన్నతపోస్టులు.
సింహం... వ్యయప్రయాసలు. రాబడికి మించి ఖర్చులు. ఇంటాబయటా సమస్యలు. దూర ప్రయాణాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులకు బదిలీలు.
కన్య.... ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. సన్నిహితులతో వివాదాలు. పనుల్లో ఆటంకాలు. వ్యాపార విస్తరణ యత్నాలు వాయిదా. ఉద్యోగ మార్పులు.
తుల.... చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగులకు శుభవార్తలు.
వృశ్చికం... కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వ్యవహార విజయం. ఆలోచనలు అమలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. కొత్త వ్యాపారాలు చేపడతారు. ఉద్యోగులకు కొంత ఊరట.
ధనుస్సు.. పనులలో జాప్యమే. దూర ప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. వ్యయప్రయాసలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటంకాలు.
మకరం... కుటుంబంలో చికాకులు. మానసిక అశాంతి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. అనారోగ్యం. వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగులకు ఆటుపోట్లు.
కుంభం..... పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో విశేష గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. రాబడి పెరుగుతుంది. వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు.
మీనం.. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో అకారణంగా తగాదాలు. ఆస్తి వివాదాలు. ఆరోగ్య భంగం. రాబడి నిరుత్సాహపరుస్తుంది. వ్యాపారాలలో లాభనష్టాలు సమానం. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.