
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్ర మాసం, తిథి: బ.విదియ ఉ.8.29 వరకు, తదుపరి తదియ, నక్షత్రం: విశాఖ రా.12.53 వరకు, తదుపరి అనూరాధ, వర్జ్యం: తె.5.16 నుండి 7.00 వరకు (తెల్లవారితే బుధవారం), దుర్ముహూర్తం: ఉ.8.18 నుండి 9.08 వరకు, తదుపరి రా.10.50 నుండి 11.36 వరకు,అమృత ఘడియలు: ప.3.04 నుండి 4.50 వరకు.
సూర్యోదయం : 5.49
సూర్యాస్తమయం : 6.11
రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు
మేషం... వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వస్తులాభాలు. పాతమిత్రులను కలుసుకుంటారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
వృషభం.... రుణఒత్తిడులు తొలగుతాయి. ఆప్తుల సలహాలు పాటిస్తారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.
మిథునం.... శ్రమ తప్పకపోవచ్చు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో వైరం. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం తప్పదు.
కర్కాటకం... వ్యవహారాలలో ఆటంకాలు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఆలోచనలు కలసిరావు. బంధువుల నుంచి సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళమే.
సింహం... పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.
కన్య....... మిత్రులతో అకారణంగా తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో చికాకులు. ఆరోగ్యసమస్యలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
తుల..... పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విలువైన వస్తువులు సేకరిస్తారు. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి ఉంటుంది..
వృశ్చికం... రుణదాతల ఒత్తిళ్లు. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. పనులు మధ్యలో విరమిస్తారు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు ఎదురవుతాయి.
ధనుస్సు.... వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి కీలక సమాచారం. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలకు హాజరవుతారు. వాహనయోగం. వ్యాపార, ఉద్యోగాలలో కొత్త ఆశలు.
మకరం.. పరిస్థితులు అనుకూలిస్తాయి. సమాజసేవలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆప్తుల నుండి పిలుపు రావచ్చు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా ఉంటాయి.
కుంభం... మిత్రుల నుంచి ఒత్తిళ్లు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. అనారోగ్యం. పనులలో అవాంతరాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగమార్పులు.
మీనం.. వ్యవహారాలలో అవాంతరాలు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.