
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం; తిథి: బ.చవితి ఉ.8.15 వరకు, తదుపరి పంచమి; నక్షత్రం: ఉత్తరాభాద్ర ప.1.06 వరకు, తదుపరి రేవతి; వర్జ్యం: రా.12.24 నుండి 1.54 వరకు; దుర్ముహూర్తం: ఉ.11.39 నుండి 12.29 వరకు; అమృత ఘడియలు: ఉ.8.32 నుండి 10.02 వరకు.
సూర్యోదయం : 5.45
సూర్యాస్తమయం : 6.24
రాహుకాలం : ప.12.30 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు
మేషం... బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.
వృషభం.... రుణవిముక్తి లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు. ఆకస్మిక ప్రయాణాలు. సోదరులతో సఖ్యత. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో క్లిష్ట సమస్యలు తీరతాయి.
మిథునం.... పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. ముఖ్య నిర్ణయాలు. శుభకార్యాలపై చర్చలు. ఆత్మీయుల నుంచి పిలుపు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే చేయిగా నిలుస్తుంది.
కర్కాటకం.... పనులలో అవాంతరాలు. రుణబాధలు పెరుగుతాయి. బంధువుల నుంచి విమర్శలు. ఆరోగ్యం మందగిస్తుంది. నిరుద్యోగులకు కొంత నిరాశ. వ్యాపారాలు, ఉద్యోగాలు ఒత్తిడులలో కొనసాగుతాయి.
సింహం.... వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రయాణాలు. సోదరులు, మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా కొనసాగుతాయి.
కన్య.... ఆర్థిక వృద్ధి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సానుకూలం. దైవచింతన.
తుల...... ఆర్థిక లావాదేవీలలో పురోగతి. భూములు కొంటారు. ఆశయాలు నెరవేరతాయి. ఆత్మీయుల నుంచి పిలుపు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకోని మార్పులు.
వృశ్చికం.... బంధువుల తాకిడి పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తి వివాదాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.
ధనుస్సు.... సన్నిహితులే శత్రువులుగా మారవచ్చు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. సోదరులతో కలహాలు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో చికాకులు.
మకరం... వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి విషయంలో నిర్ణయాలు. గృహయోగం. ^è ర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గతం కంటే మెరుగ్గా ఉంటాయి.
కుంభం... కీలక నిర్ణయాలు మార్చుకుంటారు. ఒప్పందాలు రద్దు. దూరప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు లేనిపోని చికాకులు.
మీనం... కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి. భూలాభాలు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.