
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం; తిథి: బ.తదియ ప.10.09 వరకు, తదుపరి చవితి; నక్షత్రం: పూర్వాభాద్ర ప.2.17 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర; వర్జ్యం: రా.11.25 నుండి 12.56 వరకు; దుర్ముహూర్తం: ఉ.8.18 నుండి 9.08 వరకు, తదుపరి రా.10.55 నుండి 11.41 వరకు; అమృత ఘడియలు: ఉ.6.32 నుండి 8.03 వరకు.
సూర్యోదయం : 5.45
సూర్యాస్తమయం : 6.25
రాహుకాలం : ప.3.30 నుండి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు సంకటహర చతుర్థి
మేషం.... ఆకస్మిక ధనలాభం. పనుల్లో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ఆస్తి వివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన.
వృషభం.... నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల సహాయం అందుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. దైవదర్శనాలు.
మిథునం.... ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు. బంధుమిత్రులతో వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.
కర్కాటకం.... దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. విద్యార్థులకు అంతగా అనుకూలించదు. దైవదర్శనాలు. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.
సింహం.... కొత్త ఆశలు చిగురిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పనుల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వస్తు, వస్త్రలాభాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
కన్య.... ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వాహనయోగం. విలువైన సమాచారం. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.
తుల..... వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. విద్యార్థులకు నిరుత్సాహం. వ్యాపార, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.
వృశ్చికం.... పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమా«ధిక్యం. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి. అనారోగ్యం.
ధనుస్సు...... నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలలో లక్ష్యాలు సా«ధిస్తారు.
మకరం...... రుణాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. వృత్తి, వ్యాపారాలు అంతగా అనుకూలించవు. ధనవ్యయం.
కుంభం... వ్యవహారాలలో విజయం. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆహ్వానాలు రాగలవు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.
మీనం.. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. అనారోగ్యం. పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.