
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి: బ.విదియ ప.11.41 వరకు, తదుపరి తదియ, నక్షత్రం: శతభిషం ప.3.08 వరకు, తదుపరి పూర్వాభాద్ర,
వర్జ్యం: రా.9.18 నుండి 10.50 వరకు, దుర్ముహూర్తం: ప.12.29 నుండి 1.19 వరకు, తదుపరి ప.3.00 నుండి 3.50 వరకు,అమృత ఘడియలు: ఉ.8.00 నుండి 9.36 వరకు.
సూర్యోదయం : 5.45
సూర్యాస్తమయం : 6.26
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు
మేషం.... బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
వృషభం.... వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. అంచనాలు నిజం కాగలవు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహపరుస్తాయి.
మిథునం.... సోదరులతో విభేదాలు. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. పనులు కొన్ని వాయిదా పడతాయి. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు ఎదుర్కొంటారు.
కర్కాటకం.... ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలలో జాప్యం. పనులు మధ్యలో విరమిస్తారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.
సింహం.... సన్నిహితులతో వివాదాలు తీరతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంతగా అనుకూలించదు.
కన్య..... పనులు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం. కుటుంబంలో సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు నెరవేరతాయి.
తుల.... ఆర్థిక ఇబ్బందులు. పనుల్లో జాప్యం. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. మిత్రులతో కలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.
వృశ్చికం.... పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. ధనవ్యయం.
ధనుస్సు... ప్రముఖులతో పరిచయాలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. కార్యజయం. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.
మకరం...... వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. ప్రయాణాలలో మార్పులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది పరుస్తాయి.
కుంభం... బంధువులతో సఖ్యత. ఆస్తులు వ్యవహారాలలో మరింత అనుకూలం. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.
మీనం... ఇంటాబయటా ఒడిదుడుకులు. కొన్ని వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. నిరుద్యోగులకు నిరుత్సాహం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.