
శ్రీ శోభకృత్‌నామ సంవత్సరం, దక్షిణాయణం, శరదృతువు, కార్తీక మాసం, తిథి: శు.ద్వాదశి సా.6.17 వరకు, తదుపరి త్రయోదశి, నక్షత్రం: రేవతి సా.4.01 వరకు, తదుపరి అశ్వని, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ఉ.8.25 నుండి 9.13 వరకు, తదుపరి ప.12.10 నుండి 12.58 వరకు, అమృతఘడియలు: ప.1.46 నుండి 3.14 వరకు, క్షీరాబ్ధి ద్వాదశి; రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు, యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు, సూర్యోదయం: 6.13, సూర్యాస్తమయం: 5.20.
మేషం.. ఆకస్మిక ప్రయాణాలు. కొత్తగా రుణాలు చేస్తారు. ఆరోగ్యభంగం. శ్రమ ఫలిస్తుంది. అదన పు బాధ్యతలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు. దైవదర్శనాలు.
వృషభం... ఉద్యోగ యత్నాలు సానుకూలం. ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం. దైవదర్శనాలు.
మిథునం... పరిశోధనలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.
కర్కాటకం... వ్యయప్రయాసలు. ధనవ్యయం. శ్రమ పడ్డా ఫలితం ఉండదు. అనారోగ్య సూచనలు. ఇంటాబయటా బాధ్యతలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశాజనకం.
సింహం.... కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ధనవ్యయం. స్థిరాస్తి వివాదాలు. దూరప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం. ఆధ్యాత్మిక చింతన.
కన్య..... శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. పరిచయాలు విస్తృతమవుతాయి. మీ ఉద్యోగయత్నాలు కొలిక్కి వస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో విశేష లాభదాయకం.
తుల... శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. ఆసక్తికరమైన సమాచారం. విద్యార్థుల యత్నాలు సఫలం. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు.
వృశ్చికం..... పనుల్లో జాప్యం. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. దూరప్రయాణాలు. సోదరులు, మిత్రులతో విభేదాలు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు.
ధనుస్సు.... ఆకస్మిక ప్రయాణాలు. బంధువుల నుంచి ఒత్తిడులు. అనారోగ్యం. శ్రమ పడ్డా ఫలితం ఉండదు. ఆస్తి వివాదాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. దైవదర్శనాలు.
మకరం... శుభకార్యాలకు హాజరవుతారు. ఇంటాబయటా అనుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం. ఆస్తి వివాదాల నుంచి విముక్తి. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.
కుంభం.... రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ధనవ్యయం. సోదరులతో విభేదాలు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
మీనం... దూరపు బంధువుల కలయిక. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. ఆర్థిక ప్రగతి. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.